అఫ్గానిస్థాన్‌‌ రాజధాని కాబూల్‌లోని ఆస్పత్రిపై పాక్ వైమానిక దాడి

           



పాక్ వైమానిక దాడిలో400 మంది మృతి

న్యూ డిల్లీ మార్చ్ 17 (ఎక్స్ ప్రెస్ న్యూస్);అఫ్గానిస్థాన్‌‌ రాజధాని కాబూల్‌లోని ఆస్పత్రిపై పాక్ వైమానిక దాడికి సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. దాడి అనంతరం ఆస్పత్రిలో భారీ పేలుడు సంభవించడంతో.. ఆకాశంలోని భారీగా మంటలు ఎగిసిపడుతున్న దృశ్యాలు అందులో రికార్డయ్యాయి. మరో వీడియాలో భద్రతా సిబ్బంది టార్చ్‌లైట్ వెలుగులో శిథిలాల కింద నుంచి మృతదేహాలను వెలికి తీస్తుండగాఅగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

పాక్ వైమానిక దాడిలో400 మంది మృతి

కాబూల్‌లోని డ్రగ్స్ రిహాబిలేషన్‌కు సంబంధించిన ఆస్పత్రిపై సోమవారం రాత్రి 9 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) పాక్ వైమానిక దాడి జరిపిందని ఆప్గానిస్థాన్ డిప్యూటీ ప్రభుత్వ ప్రతినిధి హమ్దుల్లా ఫిత్రత్ తెలిపారు. ఈ దాడిలో ఆస్పత్రి భవనం చాలావరకు ధ్వంసమైందని పేర్కొన్నారు. దాడుల్లో 400 మంది వరకు మరణించారని.. సుమారు 250 మంది గాయపడ్డారని చెప్పారు. వైమానిక దాడులతో ఆస్పత్రి భవనంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయని.. వాటిని అదుపులోకి తీసుకురావడానికి అగ్నిమాపక సిబ్బంది కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.ఈ దాడిలో మాదక ద్రవ్యాలకు బానిసలైన వారి చికిత్స కోసం ఉపయోగిస్తున్న పరికరాలు చాలా వరకు ధ్వంసమయ్యాయని అఫ్గాన్ ఆరోగ్య శాఖ ప్రతినిధి షరాఫత్ జమాన్ తెలిపారు. మృతుల్లో ఎక్కువగా రోగులే ఉన్నారని పేర్కొన్నారు. కాగాపాక్ దాడిని ఆఫ్గానిస్థాన్ ప్రభుత్వ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ తీవ్రంగా ఖండించారు. ఇది అఫ్గాన్ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించే చర్యేనని అభివర్ణించారు.

 ఆస్పత్రి లక్ష్యంగా దాడులు చేయలేదు.. ఖండించిన పాక్

కాబూల్‌లోని ఆస్పత్రి లక్ష్యంగా దాడులు చేశారని ఆఫ్గానిస్థాన్ చేసిన ఆరోపణలను పాకిస్థాన్ తీవ్రంగా ఖండించింది. ఆస్పత్రి లక్ష్యంగా ఎటువంటి దాడులు జరపలేదని స్పష్టం చేసింది. తాలిబాన్ సైనిక స్థావరాలుఆయుద గోదాములుఉగ్రవాద మద్దతు కేంద్రాలే లక్ష్యంగా కచ్చితమైన దాడి చేశామని పాకిస్థాన్ సమాచార మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పౌరులకుఆస్తులకు ఎటువంటి నష్టం జరగకుండానే జాగ్రత్త పడుతూనే దాడులు చేశామని స్పష్టం చేసింది.