
(ఆయుధం న్యూస్ ) లాభాల కోసం కాదు ప్రజల శ్రేయస్సు కోసమే ఆర్టీసీ బస్సులను నడుపుతున్నమని ఓ వైపు ఆర్టీసీ అధికారులు ప్రచారాలు మొదలు పెడుతుంటే షాద్ నగర్ ఆర్టీసీ అధికారులు మాత్రం ప్రయాణికులను ముప్పుతిప్పలు పెడుతున్నారని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు షాద్ నగర్ డిపో కు చెందిన ఆర్డినరి బస్సుకు ఎక్స్ ప్రెస్ బోర్డ్ పెట్టి నదువుతున్నారు అంతేకాకుండా బస్సు టికెట్ ఇవ్వడంతో పాటు హైదరాబాద్ నుండి షాద్ నగర్ వస్తున్న సందర్భంలో తొండపల్లి వద్ద బస్సు రిపేర్ జరిగితే చాలా సమయం నుండి ఆర్టీసీ అధికారులు పట్టించుకోవడం లేదని ప్రయాణికులు మండి పడుతున్నారు దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.