టిఎన్జిఓ జిల్లా అధ్యక్షుడిగా రాజీవ్ రెడ్డి


మహబూబ్ నగర్   టిఎన్జీవో జిల్లా అధ్యక్షుడిగా భూత్పూర్ మండల డిప్యూటీ తహశీల్దార్ రాజీవ్ రెడ్డి ఏకగ్రీవంగా నియామకమయ్యారు .మంగళవారం టీఎన్జీవో భవనంలో ఈ ఎన్నిక కార్యక్రమాన్ని నిర్వహించారు .అసోసియేట్ అధ్యక్షుడిగా మహబూబ్ నగర్ అర్బన్ రెవెన్యూ ఇన్స్పెక్టర్  క్రాంతి కుమార్ గౌడ్ ,వైస్ ప్రెసిడెంట్లుగా నరసింహా రెడ్డి, దామోదర్, సుజాత. సెక్రెటరీగా చంద్రనాయక్' జాయింట్ సెక్రెటరీలుగా వెంకట్రామ్ రెడ్డి, కృష్ణకాంత్, దివ్య ,ట్రెజరర్గా పి. కృష్ణమోహన్ ,ఆఫీసు సెక్రెటరీగా రవికాంత్, ఆర్గనైజింగ్ సెక్రెటరీగా విజయ్ కుమార్ , స్పోర్ట్స్ సెక్రెటరీగా శ్యాంసుందర్ రెడ్డి ,పబ్లిక్ సెక్రెటరీగా నంద కిషోర్ ,వీసీ మెంబర్లుగా ఖదీర్ చంద్రశేఖర్, ప్రియాంక ,హేమలత, ఎంపికయ్యారు .