ప్రజావాణికి 96 దరఖాస్తుల స్వీకరణ
జోగులాంబ గద్వాల జిల్లా.. ఆయుధం న్యూస్ ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి అర్జీలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టర్ కార్యాలయములోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 96 మంది తమ సమస్యల పరిష్కరం కోసం దరఖాస్తు చేసుకున్నారని అదనపు కలెక్టర్ తెలిపారు. ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాస రావు,వివిధ శాఖల జిల్లా అధికారులు,తదితరులు పాల్గొన్నారు.
.......................................