కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసమే నూతన మండల కమిటీల ఏర్పాటు


డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి 

రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు 


వనపర్తి  (ఆయుధం న్యూస్ )నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలనే లక్ష్యంతో శ్రీరంగాపురం మండలం , పెబ్బేరు మండలం, పెబ్బేర్ టౌన్ లలో నూతన మండల కమిటీలను నియమించడానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొత్త కాపు శివసేనారెడ్డి అధ్యక్షతన రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి గారు, నియోజకవర్గ శాసనసభ్యులు తూడి మెగా రెడ్డి గారు నూతన కమిటీలను వేయడం జరిగింది.


 చిన్నారెడ్డి గారు మాట్లాడుతూ

 భారత దేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించిందని అన్నారు. స్వాతంత్రం వచ్చినంక  కటికే పేదరికం నుంచి దేశాన్ని అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేయడానికి  కారణం కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో బిజెపి పార్టీ పాత్ర శూన్యమని బిజెపి నాయకులు ఏ ఒక్కరు కూడా స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనలేదని  అన్నారు.

కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం, ఆర్థిక సమానత్వం, మరియు పేదరిక నిర్మూలనకు ప్రాధాన్యత ఇస్తుంది అని అన్నారు. ప్రపంచంలో కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీ ఎక్కడ లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉండడమే మీరు చేసుకున్న పుణ్యమని కార్యకర్తలను ఉత్తేజపరిచారు. కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకే  పదవులు దక్కుతాయని అన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి  రాహుల్ గాంధీ గారిని ప్రధానిని చేసుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుందని వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారు ప్రధాని కావడం ఖాయమని  అన్నారు.


కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి నందిమల్ల యాదయ్య, వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ యాదవ్, వనపర్తి జిల్లా ఓబిసి అధ్యక్షులు కోట్ల రవి, వనపర్తి పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ కదిర రాముల యాదవ్, వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ పురుషోత్తం, శ్రీరంగాపూర్ మండల అధ్యక్షులు రాములు యాదవ్, పెబ్బేర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, పెబ్బేర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమోదిని  రెడ్డి , వనపర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ ,వనపర్తి జిల్లా NSUI అధ్యక్షుడు రోహిత్, వనపర్తి మండల్ NSUI అధ్యక్షుడు ఎత్తం చరణ్ రాజ్,  శ్రీరంగాపురం గ్రామ సర్పంచి మద్దిలేటి, మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.