మాలలకు విద్యను దూరం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

      మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు పబ్బతి శ్రీకృష్ణ


హైదరాబాద్ మార్చి 16 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );రాజ్యాంగాన్ని విరుద్ధంగా ప్రస్తుత జనాభా లెక్కలు కులగానన  చేయకుండా 2011 జనాభా లెక్కల ఆధారంగా ఏకసభ్య కమిషన్ వేసి చంద్రబాబు నియంత్రుత్వం లో  వర్గీకరణ చేసి అందులో కొత్తగా రోస్టర్ పాయింట్ పెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాలలకు విద్యను శాశ్వతంగా దూరం చేసాడని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు పబ్బతి శ్రీకృష్ణ ఆరోపించారు. హైదర్ గూడలో  మీడియా సమావేశం లో మాట్లాడుతూ  ఎస్సీ వర్గీకరణ ఒకటి, రెండు, మూడు, గ్రూపులుగా వర్గీకరించాలని డిమాండ్ చేసారు. ఒకటవ గ్రూప్ కు అయిదు శాతం రిజర్వేషన్లు రోస్టర్ పాయింట్లు 7, రెండవ గ్రూపు 9% రిజర్వేషన్ రోస్టర్ పాయింట్లు 2, 16 , 27, 47, 52, 66, 72, 87, 97, మూడవ గ్రూపు 5 శాతం రిజర్వేషన్లు రోస్టర్ పాయింట్లు 22, 41, 62, 77, 91 కాబట్టి పివిఆర్ రావు స్థాపించిన మాల మహానాడుగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో రోస్టర్ పాయింట్లు రెండవ గ్రూపు మాదిరిగా సరిచేయాలని డాక్టర్ పద్ధతి శ్రీకృష్ణ డిమాండ్ చేశారు లేనిపక్షంలో రాబోయే రాచకొండ, సైబరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఏఎన్ విని  కుమార్, గ్రేటర్ హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్, కే అరుణ్ కుమార్ త్వేలన్గన కన్వినర్, పి రాజేష్ ,ఎం.జి వినయ్ కుమార్ త్యదితేరులు పాల్గొన్నారు.