పేద మహిళ వైద్యానికి వెస్సో రూ.44,000 ల ఆర్దిక సహాయం


హైదరాబాద్ మార్చ్ 17 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );బ్రెస్ట్ క్యాన్సర్ తో బాదపడుతున్న పేద మహిళ వైద్యానికి వెస్సో రూ.44,000 ల ఆర్దిక  సహాయంపాల్వంచ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నివాసి  తాటికొండ అనంతలక్ష్మి(50) కి జూలై 2025 లో బ్రెస్ట్ క్యాన్సర్ అని నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆమె బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ పధకం ద్వారా చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే ఆమెకు కీమోథెరపీ చికిత్స అనంతరం శస్త్రచికిత్స కూడా జరిగింది. ప్రభుత్వ పథకం ద్వారా ప్రధాన చికిత్స జరుగుతున్నప్పటికీ, ఇప్పటివరకు మందులు, ప్రయాణం మరియు ఇతర ఖర్చుల కోసం సుమారు ₹50,000/- ఆమె కుటుంబం ఖర్చు చేసింది. ఆమె భర్త రోజువారీ కూలీ పొందే కార్పెంటర్. వారి కుటుంబం ఆర్థికంగా చాలా బలహీన స్థితిలో ఉంది. వారికి వివాహమైన ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.  అయితే వారు కూడా ఆర్థికంగా స్థిరంగా లేని పరిస్థితిలో ఉన్నారు.  బంధు మిత్రుల ద్వారా వెస్సో గురించి తెలుసుకొని చికిత్స కొనసాగించేందుకు ఆర్థిక సహాయం అందించమని అనంతలక్ష్మి వెస్సో ను అభ్యర్థించారు.  గౌరవ దాతల సహకారంతో వెస్సో ట్రస్ట్ కార్యదర్శి డాక్టర్ బంగారు శ్రీనివాస్ బసవతారకం హాస్పిటల్ లో అనంతలక్ష్మి కి 44,004 రూపాయల చెక్ అందజేశారు.