భార‌త్‌లో స‌దుపాయాలు లేవ‌ని నింద‌లు చేయ‌వ‌ద్దు


యువ డాక్ట‌ర్లకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జ‌గ‌త్ ప్ర‌కాశ్ న‌డ్డా హితవు


ల‌క్నో డిసెంబర్ 20 (ఆయుధం న్యూస్ );: దేశంలో

వైద్య సౌక‌ర్యాలు స‌రిగా లేవ‌ని యువ డాక్ట‌ర్లు ఇక ఫిర్యాదు చేయ‌రాదు అని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జ‌గ‌త్ ప్ర‌కాశ్ న‌డ్డా  అన్నారు. దేశంలో ఉన్న వ‌న‌రుల‌ను, సంస్థ‌ల‌ను సద్వినియోగం చేసుకోవాల‌న్నారు. విదేశాల‌కు వెళ్లాల‌నుకుంటున్న యువ డాక్ట‌ర్లు స్వేచ్ఛ‌గా వెళ్ల‌వ‌చ్చు అని, కానీ విదేశాల‌కు వెళ్లే నెపంతో దేశంలో వైద్య సౌక‌ర్యాలు స‌రిగా లేవ‌ని నింద‌లు మోప‌రాదు అని మంత్రి న‌డ్డా పేర్కొన్నారు. ల‌క్నోలో కింగ్ జార్జి మెడిక‌ల్ యూనివ‌ర్సిటీ 21వ స్నాత‌కోత్స‌వంలో పాల్గొన్న ఆయ‌న మాట్లాడుతూ విదేశాల‌కు వెళ్లే యువ డాక్ట‌ర్లు స్వేచ్ఛ‌గా వెళ్ల‌వ‌చ్చు అని, కానీ భార‌త్‌లో స‌దుపాయాలు లేవ‌ని నింద‌లు చేయ‌వ‌ద్దు అన్నారు. ఇక్క‌డ ఉన్న సంస్థ‌ల‌ను, స‌దుపాయాల్ని వాడుకోవాల‌న్నారు. ప్ర‌ధాని మోదీ నేతృత్వంలో దేశ వైద్య వ్య‌వ‌స్థ పూర్తిగా మారింద‌న్నారు. దేశంలో ఆల్ ఇండియా ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ సంస్థ‌ల సంఖ్య ఇప్పుడు 23కు పెరిగింద‌న్నారు.