తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ విస్తృతస్థాయి సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. దాదాపు మూడు గంటలపాటు ఈ సమావేశం కొనసాగింది. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు కేసీఆర్. దాదాపుగా ఎనిమిది నెలల తర్వాత మీడియా ముందుకు రావడం ఇదే తొలిసారి.
ఉమ్మడి ఏపీలో మహబూబ్ నగర్ జిల్లా తీవ్ర వివక్షకు గురైందని, ప్రత్యేక రాష్ట్రంలోనూ ఇదే కొనసాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణకు ద్రోహం చేస్తోన్నాయని ధ్వజమెత్తారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 308 కిలో మీటర్ల కృష్ణా నది పారుతుందని, గత ప్రతిపాదిత ప్రాజెక్టుల ప్రకారం 174 టీఎంసీలు ఈ జిల్లాకు రావాల్సి ఉన్నప్పటికీ.. అలా జరగట్లేదని అన్నారు. ఏపీ ఏర్పాటుతో మహబూబ్‌నగర్ జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట విని కేంద్రం డీపీఆర్‌ను వెనక్కి పంపిందని ఆరోపించారు. అక్కడి ప్రభుత్వం చెప్పినట్టు ఇక్కడి పెద్దలు నడుచుకుంటోన్నారని అన్నారు. డీపీఆర్ వెనక్కి పంపితే భూమ్యాకాశాలు ఒక్కటి చేయ్యాల్సిందిపోయి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని అన్నారు. రేవంత్ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందనా లేదని చెప్పారు. నదీ జలాల కోసం ప్రభుత్వం అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో ఈ ప్రభుత్వం తట్టెడు మట్టి కూడా తీయలేదని మండిపడ్డారు.
గతంలో చంద్రబాబు మహబూబ్‌నగర్ జిల్లాను దత్తత తీసుకున్న విషయాన్ని కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇష్టమొచ్చినట్లు పునాదిరాళ్లు కూడా వేశారని, తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని చెప్పేందుకు జోగులాంబ నుంచి గద్వాల వరకు పాదయాత్ర చేశానని కేసీఆర్ పేర్కొన్నారు. కృష్ణా నది పారే జిల్లాలో గంజి కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన దుస్థితి ఉండేదని అన్నారు. ప్రతిపాదిత ప్రాజెక్టులు మార్చొద్దని ఎస్ఆర్సీ స్పష్టంగా చెప్పిందని, పాలమూరు ఎత్తిపోతలు కొత్త ప్రాజెక్ట్ కాదని వివరించారు.
గతంలోనే నీటి కేటాయింపులు జరిగాయని, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌ను కలిసి చాలాసార్లు విజ్ఞప్తి చేశామని కేసీఆర్ చెప్పారు. ఈ ప్రాంతం నిర్లక్ష్యానికి గురైందని బచావత్ ట్రిబ్యునల్ ప్రకటించిందని, సుమోటోగా జూరాల ప్రాజెక్టుకు బచావత్ నీళ్లు కేటాయించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో వడ్లు, పత్తి కొనే దిక్కులేదని, చివరికి యూరియా సప్లై చేసే తెలివితేటలు కూడా ప్రభుత్వానికి లేకుండాపోయాయని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ రాగానే యూరియా కోసం చెప్పులు పెట్టే దుస్థితి వచ్చిందని విమర్శించారు. తెలంగాణకు బీజేపీ శనిలా మారిందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. రెండేళ్ల నుంచి ఈ పరిణామాలన్నింటినీ చూస్తూ వస్తున్నానని, ఇక ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. బహిరంగ సభలు పెట్టబోతున్నామని, తాను స్వయంగా హాజరవుతానని అన్నారు. ఇప్పటివరకు ఒక కథ, రేపట్నుంచి వేరే కథ ఉంటుందని, ప్రభుత్వ పెద్దల తోలు తీస్తామని, మెడలు వంచుతామని కేసీఆర్ స్పష్టం చేశారు. ఫ్యూచర్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందాలు సాగుతున్నాయని ఆరోపించారు. గురుకుల పాఠశాల పిల్లలను చదివించడానికి చేతకావట్లేదు గానీ ఫ్యూచర్ సిటీ కడతారట అని చురకలు అంటించారు.