ఎంజిఎన్ఆర్ఇజిఎను ప్రభుత్వం నాశనం చేస్తోంది


  మండిపడ్డ కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ



న్యూఢిల్లీ డిసెంబర్20 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );: ఉపాధిహామీ పథకం పేరు మార్పుపై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ స్పందించారు. ఎంజిఎన్ఆర్ఇజిఎను ప్రభుత్వం నాశనం చేస్తోందని ఆమె మండిపడ్డారు. ఎంజిఎన్ఆర్ఇజిఎ రూపురేఖలనే ప్రభుత్వం మార్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్ల మంది రైతులు, కూలీల ప్రయోజనాలను దెబ్బతీశారని, గ్రామీణ పేదలను మోడీ ప్రభుత్వం విస్మరిస్తోందని ఆమె అన్నారు. ఎంజిఎన్ఆర్ఇజిఎ స్థానంలో ప్రభుత్వం నల్లచట్టం తెస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. నల్లచట్టంపై పోరాడేందుకు లక్షల మంది కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.