అపోలో యూనివర్సిటీలో గర్ల్స్ బాత్రూమ్ లో సిక్రెట్ కెమెరాలు


 అమరావతి అక్టోబర్ 10 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా కేంద్రంలోని లేడీస్ హాస్టల్ బాత్రూంలో హిడెన్ కెమెరా లభించింది. అపోలో యూనివర్సిటీ విద్యార్థినిల బాత్రూమ్ లో కెమెరా కనిపించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టాయిలెట్స్ లో శబ్దం వస్తుందని గమనించిన విద్యార్థిని, ఈనెల 1న యూనివర్సిటీ రిజిస్టార్ కు సమాచారం ఇచ్చింది. అపోలో యూనివర్సిటీ రిజిస్టర్ పోతురాజు రహస్యంగా తాలూకా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. చిత్తూరు తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. తమిళనాడుకు చెందిన ఓ ప్రైవేటు సైట్ ఇంజనీర్ కాంతా రూబెన్, విరుద్ నగర్ జిల్లా వాసి సీక్రెట్ కెమెరాలు పెట్టినట్టు సమాచారం. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. నిందితుడు వద్ద నుంచి ఇప్పటికే మొబైల్, ల్యాప్ టాప్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. బాత్రూమ్ లోకి సిక్రెట్ కెమెరాలు ఎవరు పెట్టారు అనేది తెలియాల్సి ఉంది.