అమరావతి ఆయుధం న్యూస్ ప్రధాని మోదీ ఏపీ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 16న ఉ. 7.50 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి కర్నూలు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనం చేసుకొంటారు. మ. 1.40 గంటలకు సుందిపెంట హెలిప్యాడ్ నుంచి నన్నూరు హెలిప్యాడ్కు చేరుకుంటారు. ఆ తర్వాత రాగ మయూరి గ్రీన్ హిల్స్ వెంచర్క శంకుస్థాపన చేయనున్నారు. ఇక, సా. 4 గంటల వరకు బహిరంగ సభలో మోదీ ప్రసంగించనున్నారు.