హైదరాబాద్ అక్టోబర్ 15 (ఎక్స్ ప్రెస్ న్యూస్ ); : రా ష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు సు ప్రీం కోర్టులో జస్టిస్ నాగరత్న, జస్టి స్ ఆర్ మహదేవ్ ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. విచారణ అనంతరం ధర్మాసనం కీలక వ్యా ఖ్యలు చేసింది. ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు కంప్యూటర్ క్లౌడ్, ఐ క్లౌడ్ పాస్‌వర్డ్ రీసెట్ చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. అలాగే ప్రభాకర్ రావుకు అరెస్టు నుంచి క ల్పించిన స్పెషల్ రిలీఫ్‌ను న్యాయస్థా నం పొడిగించింది. తదుపరి విచారణను నవంబర్ 18కి వాయిదా వేసింది.
