సామాజిక తెలంగాణ కోసం మాట్లాడడం తప్పా?



 తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

హైదరాబాద్ అక్టోబర్ 5 )ఎక్ల్స్ ప్రెస్ న్యూస్ );: సామాజిక తెలంగాణ కోసం మాట్లాడడం తప్పా? అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. మాజీ సిఎం కెసిఆర్ ఫోటో లేకుండానే జాగృతి జనం బాట పేరుతో యాత్ర చేస్తానని తెలిపారు. తన దారి తాను చూసుకుంటున్నానని అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తమ దారులు వేరే అయినప్పుడు తన లైన్ తాను తీసుకోవడం కరెక్ట్ అని దుర్మార్గుల నుంచి చెట్టును కాపాడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశానని తెలియజేశారు. జాగృతి మొదటి నుంచి స్వతంత్రంగా పని చేసిందని, కెసిఆర్ నుంచి ఒక్క ఆలోచన తీసుకోలేదని చెప్పారు. బిఆర్ఎస్ నుంచి తన సస్పెన్షన్ కారణాలను విశ్లేషించుకున్నానని, ఏదో తప్పు మాట్లాడినట్టు చూపించి కుట్ర చేసి బయటకి పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్ నుంచి యాత్ర ప్రారంభం అవుతుందని..4 నెలల పాటు కొనసాగుతుందని కవిత పేర్కొన్నారు.