కంటోన్మెంట్ భూమి కావచ్చు కానీ అది ప్రజల భూమి

కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్న కంటోన్మెంట్ సీఈవో


            పేదవారిని ఇబ్బంది పెట్టే చర్య మంచిది కాదు



సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు మీటింగ్ లో ఎంపి ఈటల రాజేందర్


హైదరాబాద్ అక్టోబర్ 16 (ఎక్స్ ప్రెస్ న్యూస్ ) కంటోన్మెంట్ భూమి కావచ్చు కానీ అది ప్రజల భూమి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న... ఆ భూములు ప్రజలవే కదా. జూబ్లీ బస్టాండ్ పక్కన షాపులు కూలగొట్టడం పై నేను నిరసన వ్యక్తం చేశాను. పేదవారిని ఇబ్బంది పెట్టే చర్య మంచిది కాదని హెచ్చరించారు. కింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు మీటింగ్లో మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ పాల్గొన్నారు.ఏలా పడితే అలా పర్మిషన్ ఇచ్చి కంటోన్మెంట్ అంతా పాడైపోయింది మరోసారి అలాంటి పరిస్థితి తీసుకురావద్దన్నారు. కంటోన్మెంట్లో 100 ఏళ్ల క్రితం ఈ కంటోన్మెంట్ లో పనిచేసే వాళ్లు 99 సంవత్సరాల లీజు ప్రకారం 60 గజాలలో ఇల్లు కట్టుకున్నారు. ఆ లీజులో ఇల్లు కట్టుకున్న వారికి పర్మినెంట్ గా ఇళ్ళు మంజూరు చేయాలని మంత్రి గారికి దరఖాస్తు పెట్టామని చెప్పారు.కంటోన్మెంట్లో అక్కడక్కడ పేదవారు రోడ్డు పక్కన చిన్న చిన్న హోటల్స్ పని చేసేవారు, బాటిల్స్ అమ్ముకునేవారు షెడ్లు వేసుకొని బతుకుతున్నారు. కంటోన్మెంట్ బోర్డ్ వారు నోటీసులు ఇవ్వకుండా సామాన్లు తీసుకునే సమయం ఇవ్వకుండా షాప్స్ అన్ని కూలగొట్టి వారిని ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు.  ప్రజా ప్రతినిధులకు ఏం సంబంధం అని కంటోన్మెంట్ సీఈవో మాట్లాడుతున్నారు...?అవి కళ్ళు నెత్తికెక్కి మాట్లాడిన మాటలు. అధికారులు వస్తుంటారు పోతుంటారు కానీ ప్రజల మధ్య ఉండేది ప్రజా ప్రతినిధి కదా. రూల్స్ కు విరుద్ధంగా ప్రజలను వేధించే ప్రయత్నం చేసినా.. పర్మిషన్ ఇచ్చినా.. అడ్డుకునే వాడు, ఆపేవాడు ప్రజాప్రతినిధి. కంటోన్మెంట్లో ఏం జరుగుతుందో ఒక డీటెయిల్ రిపోర్ట్ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారికి ఇచ్చి ఇలాంటివి జరగకుండా చూడడానికి నా వంతు ప్రయత్నం చేస్తానన్నారు.