వెనెజువెలా దేశానికి చెందిన మరియా కొరీనా మచాడో కు ప్రతిష్ఠాత్మక నోబెల్‌ శాంతి బహుమతి

న్యూ డిల్లీ అక్టోబర్ 10 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );వెనెజువెలా   దేశానికి చెందిన మరియా కొరీనా మచాడో   కు ప్రతిష్ఠాత్మక నోబెల్‌ శాంతి బహుమతి     దక్కింది. ఈ విషయాన్ని నోబెల్‌ కమిటీ   తన అధికారిక ఎక్స్‌ ఖాతా ద్వారా వెల్లడించింది. 2025 సంవత్సరానికిగాను మచాడో నోబెల్‌ శాంతి బహుమతికి ఎంపికయ్యారు.మరియా కొరీనా.. ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడినందుకుగానూ ఈ పురస్కారం లభించింది. కాగా అత్యున్నత పురస్కారం కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. ఇదిలావుంటే హిరోషిమా, నాగసాకిల్లో అణుదాడి నుంచి బయటపడిన బాధితుల పక్షాన పోరాడుతోన్న జపాన్‌కు చెందిన ‘నిహాన్‌ హిడాంక్యో’ సంస్థకు గత ఏడాది నోబెల్‌ శాంతి బహుమతి దక్కింది.