నల్లా కనెక్షన్ కట్ చేసినందుకు లోకాయుక్తకు పిర్యాదు


వనపర్తి, ఆయుధం ప్రతినిధి(పోలిశెట్టి బాలకృష్ణ)


వనపర్తిలోని పీర్లగుట్ట ఛందాపూర్ రోడ్డు(శాంతినగర్)లో తమకు తెలుపకుండా నల్లా కట్ త్రాగు నీరు లేకుండా చేశారని,అధికారులపై చర్యలు తీసుకోవాలని విలేకరి కాగితాల గోపాల్ (సెల్ నంబర్ 9390653190) కోరారు. అధికారుల నిర్లక్ష్యం గురించి తెలంగాణ లోకాయుక్తకు పిర్యాదు చేశామని చెప్పారు. అదే విదంగా నల్లా కనెక్షన్ వివరాలు ఆన్ లైన్ లో నమోదు చేయాలని వనపర్తి జిల్లా కలెక్టర్ కు ప్రజావాణిలో దరఖాస్తు ఇచ్చామని, మునిసిపల్ డైరెక్టర్(డి.ఎం.ఎ)కు పోస్టులో పంపినా చర్యలు తీసుకోలేదని తెలిపారు. నల్లా కనెక్షన్ కట్ చేసి, త్రాగు నీరు లేకుండా చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.