శ్రీశైలం క్షేత్రాన్ని దర్శించుకున్న ప్రధాని నరేంద్ర మోడీ

 అమరావతి/ శ్రీశైలం/ హైదరాబాద్ /నాగర్ కర్నూల్  అక్టోబర్ 16 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );: ప్రధాని నరేంద్ర మోడీ శ్రీశైలం క్షేత్రాన్ని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. భ్రమరాంబ, మల్లికార్జున స్వామి వారికి ఆయన పూజలు చేశారు. ప్రధాని మోడీ వెంట సిఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్‌లు ఉన్నారు. శ్రీశైలం పరిసరాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సున్నిపెంట ప్రాంతంలో 1500 మంది సిబ్బంది పహారాగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు పర్యటనకు పిఎం మోడీ వచ్చిన విషయం తెలిసిందే.  


శ్రీశైలం, అక్టోబర్ 16 ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానాన్ని సందర్శించారు. ఆయనతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఆలయ దర్శనానికి ముందుకొచ్చారు.


ముగ్గురు నేతలు సంప్రదాయ వేషధారణలో ఆలయ ప్రాంగణంలో కనిపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. మూడు పార్టీలకు చెందిన ప్రముఖులు ఒకే ఫ్రేములో కనిపించడం నెటిజన్లకు విశేషంగా నచ్చింది. ఫోటోపై "PIC OF THE DAY" అంటూ శీర్షికలతో అభిమానులు పోస్టులు పెడుతున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ తన అధికారిక (మునుపటి ట్విట్టర్) ఖాతాలో తెలుగులో ఓ ట్వీట్ చేసి ఆకట్టుకున్నారు. “నా తోటి భారతీయుల సౌభాగ్యం కోసం, వారి ఆరోగ్యం కోసం ప్రార్థించా. అందరూ సుఖ సౌభాగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను,” అంటూ భావోద్వేగపూరితంగా ట్వీట్ చేశారు. తెలుగు ప్రజలపై మోదీ చూపిన ఈ మమకారం నేటిజన్ల ప్రశంసలు తెచ్చుకుంది.

దేవస్థానం అధికారులు మోదీకి సంప్రదాయ రీతిలో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో ప్రధాని ఉన్నారు. భద్రతా దృష్ట్యా ఆలయ పరిసరాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.


మూడు ప్రముఖ నాయకులు ఒకే వేదికపై కలుసుకోవడం, ముఖ్యంగా రాజకీయంగా విభిన్న అభిప్రాయాలున్న నాయకులు ఒకే దైవ దర్శనానికి రావడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది.