హైదరాబాద్ అక్టోబర్ 15 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );కర్నూలు జిల్లాలో16 న జరుగుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మహాసభకు తెలంగాణ రాష్ట్రం నుండి ప్రత్యేక బస్సులను పంపినట్లు బర్కత్ పురా డిపో మేనేజర్ మంజుల తెలిపారు. బుధవారం డిపో ఆవరణలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆర్టీసీ పైఅధికారుల ఆదేశానుసారం నగరం లోని 16 డిపో ల నుండి దాదాపు 20 బస్సుల చొప్పున కర్నూలు జిల్లాకు ప్రత్యేకంగా పంపినట్టు తెలిపారు. అంతేకాకుండా నగరంలోని ఆయా డిపోల నుండి ఆర్టీసీ బస్సులను అక్కడికి పంపినట్లు అధికారులు వెల్లడించారు.
