బీసీ సమాజాన్ని మోసం చేస్తున్నారు.. కిషన్ రెడ్డిపై రాజాసింగ్ ఘాటు వ్యాఖ్యలు
హైదరాబాద్ అక్టోబర్ 15 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );: తాజాగా మరోసారి కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. 'ఇదేమి రాజ్యం.. ఇదేమి రాజ్యం.. కిషన్ రెడ్డి రాజ్యం.. కిషన్ రెడ్డి రాజ్యం. తెలంగాణలో ఎన్నికలు జరిగినప్పుడల్లా లేదా ప్రముఖ నాయకుడు వచ్చినప్పుడల్లా, భవిష్యత్తులో ఒక బీసీ తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతాడని అందరూ అంటారు. తెలంగాణలో చిన్న ఎన్నికల గాని పెద్ద ఎన్నికల గాని వస్తే బీసీలనే మర్చిపోతారు.' అని రాజాసింగ్ ఆరోపించారు.'బీసీలు మన తెలంగాణ భారతీయ జనతా పార్టీ లోపట ఎక్కడున్నారో కొద్ది చెప్తారా కిషన్ రెడ్డి. నేను ఇంతకు ముందు ఎప్పుడూ ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు లేదా ఓబీసీల గురించి మాట్లాడలేదు. నేను హిందూత్వం గురించి మాత్రమే మాట్లాడుతాను. కానీ నేను ఈరోజు దాని గురించి మాట్లాడటానికి కారణం మీరు ప్రతి ఎన్నికల్లో బీసీ కార్డును ప్లే చేసి, బీసీ సమాజానికి మీరు మోసం చేస్తారు. అందుకే నేను ఈరోజు చెప్పాల్సి వచ్చింది.' అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై రాజాసింగ్ మరోసారి తన మాటల తూటాలను వదిలారు.అయితే తాజాగా నిన్న(మంగళవారం) కూడా కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపణలు చేశారు. ‘కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిజీ.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మీరు ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోతారు? జూబ్లీ హిల్స్ ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నారు. బీఆర్‌ఎ్‌సను గెలిపిస్తారా? కాంగ్రెస్‌ను గెలిపిస్తారా..? అని సోషల్ మీడియాలో మిమ్మల్ని జనాలు అడుగుతున్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. మీ గౌరవం ప్రమాదంలో ఉందా ?’ అని రాజాసింగ్ వ్యాఖ్యలు చేశారు.