వ్యవసాయం, రైతులకు దేశాభివృద్ధిలో ప్రధాన పాత్ర

రైతుల కోసం ఖర్చు చేయడంలో వెనకాడేది లేదు


ధనధాన్య కృషి యోచన పథకాన్ని మోడీ ప్రారంభించిన ప్రధానినరేంద్ర మోడీ


న్యూ ఢిల్లీ అక్టోబర్ 11 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );: రైతుల కోసం ఖర్చు చేయడంలో వెనకాడేది లేదని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. వ్యవసాయం, రైతులకు దేశాభివృద్ధిలో ప్రధాన పాత్ర ఉందని అన్నారు. ధనధాన్య కృషి యోచన పథకాన్ని మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతులు బాగుంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని అన్నారు. గత ప్రభుత్వాలు రైతులను ఏనాడు పట్టించుకోలేదని విమర్శించారు. ఎన్డియే ప్రభుత్వం వచ్చాక రైతులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని, రైతుల ప్రయోజనాల కోసం అనేక పథకాలు తీసుకొచ్చామని తెలియజేశారు. వ్యవసాయ రంగంలో నేడు రెండు పథకాలు ప్రారంభించడం సంతోషంగా ఉందని, ఏ పథకం ప్రారంభించినా పేదలను దృష్టిలో పెట్టుకునే చేస్తున్నామని అన్నారు. రైతుల ముఖాల్లో ఆనందం చూడాలనేదే తమ మొదటి ప్రాధాన్యత అని, రైతులకు ఎదురవుతున్న సవాళ్ల పరిష్కారంలో నూతన ఆవిష్కరణలు వస్తున్నాయని నరేంద్ర మోడీ పేర్కొన్నారు.