నేడు కర్నూలుకు ప్రధాని నరేంద్ర మోదీ రాక

ఉదయం 10 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో కర్నూలుకు


ఉదయం 11.15 గంటలకు శ్రీ భమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శనం


మధ్యాహ్నం 3 గంటలకు అక్కడ నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు

అమరావతి, అక్టోబర్ 15 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం నాడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనకు సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ ఖరారైంది. అధికారిక సమాచారం ప్రకారం.. ప్రధాని మోదీ గురువారం ఉదయం 10 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో కర్నూలు ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో సున్నిపెంట వెళ్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి భ్రమరాంబ గెస్ట్ హౌస్‌కు చేరుకుంటారు. అక్కడ ఫ్రెషప్ అయి.. ఉదయం 11.15 గంటలకు శ్రీ భమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకుంటారు. స్వామివార్ల దర్శనం అనంతరం మధ్యాహ్నం 12.10 గంటలకు శివాజీ మహారాజ్ స్ఫూర్తి కేంద్రాన్ని ప్రధాని సందర్శిస్తారు.ఈ కార్యక్రమం ముగిసిన తరువాత ప్రధాని మోదీ మళ్లీ సున్నిపెంటకు చేరుకుంటారు. అటునుంచి హెలికాప్టర్‌లో నన్నూరు రాగ మయూరి గ్రీన్ హిల్స్ ఎలిప్యాడ్ వద్దకు వెళ్తారు. మధ్యాహ్నం 2.30 గంటలకు సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తరువాత మధ్యాహ్నం 3 గంటలకు అక్కడ నిర్వహించే భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొంటారు. ఈ సభ అనంతరం 4.50 నిమిషాలకు కర్నూలు ఎయిర్‌పోర్టుకు వెళ్లి.. అక్కడి నుంచి ఢిల్లీకి తిరుగుపయనం అవుతారు.