అగ్రవర్ణ రాజకీయ నాయకులకు మంచి బుద్ధి ప్రసాదించాలి


వనపర్తి, ఆయుధం ప్రతినిధి(పోలిశెట్టి బాలకృష్ణ)


బీసీ రిజర్వేషన్లపై నక్క నాటకాలు ఆడుతున్న అగ్రవర్ణ రాజకీయ నాయకులకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు వినతి పత్రం అందజేశామని అఖిలపక్ష ఐక్యవేదిక, బీసీ ఐక్యవేదిక నాయకులు సతీష్ యాదవ్, నర్సింగరావు, విజయ్ యాదవ్ 

తెలిపారు.

హైకోర్టులో బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వచ్చిన తీర్పులో రాజకీయ నాయకుడు చేసిన తప్పిదాలు ఉండడంతో హైదరాబాద్ కూకట్ పల్లి డివిజన్ లోనీ, మూసాపేట్ అంబేద్కర్ చౌరస్తాలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ కు వినతిపత్రం ఇస్తూ బీ.సీ.లపై కుట్ర చేస్తున్న అగ్రవర్ణాల నాయకులకు బుద్ధి రావాలని, అట్టడుగు వర్గాలకు కూడా చట్టసభల్లో వాటాలు కావాలని, రాజ్యాంగ నిర్మాత వైన నీలాంటి మహానుభావులు మళ్లీ పుట్టి బి సి లకు రాజ్యాధికారం వైపు మళ్ళించాలని  కోరారు.

ఈ కార్యక్రమంలో   అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు డాక్టర్ సతీష్ యాదవ్, తెలంగాణ బీసీ సమాఖ్య అధ్యక్షుడు (కూకట్పల్లి ఎమ్మెల్యే కంటెస్టెంట్ అభ్యర్థి) బాసెట్టి నర్సింగరావు, తీన్మార్ మల్లన్న టీం. వనపర్తి అధ్యక్షుడు విజయ్ యాదవ్,  ఎమ్మార్పీఎస్ నగర కార్యదర్శి దేవేంద్రం,  ఎమ్మార్పీఎస్ నాయకులు నర్సింగరావు, తెలంగాణ వికాస్ సిటీ వైస్ ప్రెసిడెంట్ ప్రకాష్ ముదిరాజ్, శివ నారాయణ, ఏధుల మోహన్రావు, ఆర్.డి. మోహన్ రావు, ప్రేమ్, శివ  పాల్గొన్నారు.