దేశంలోనే అత్యధికంగా వరి పండిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డు

గోదావరి- బనకచర్ల ప్రాజెక్టు, ఆల్మట్టి ఎత్తు పెంపునకు తాము వ్యతిరేకం


                   మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్ అక్టోబర్ 11 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );: దేశంలోనే అత్యధికంగా వరి పండిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డుకెక్కిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. త్వరలో ధాన్యం కొనుగోళ్లు కూడా ప్రారంభం అవుతాయని అన్నారు. ఈ సందర్భంగా హనుమ కొండలో ఉత్తమ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగంగా మారినప్పటికి వరిసాగులో రికార్డు సాధించామని, మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం ప్రాజెక్టుల నుంచి ఒక్క చుక్క కూడా నీరు ఎత్తిపోయలేదని తెలియజేశారు. బిఆర్ఎస్ హయాంలో గోదావరి, కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని మండిపడ్డారు. జడేజా మ్యాజిక్.. రెండో రోజు ఆట ముగిసేసరికి స్కోర్ ఎంతంటే.. మరిన్ని కనుగొనండి లైఫ్ స్టైల్ ఆధ్యాత్మిక పర్యటనలు బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ వార్తాపత్రికలు చందా క్రైమ్ థ్రిల్లర్ పుస్తకాలు లైఫ్ స్టైల్ ఉత్పత్తులు తాజా వార్తలు రాజకీయ విశ్లేషణ పుస్తకాలు వ్యాపార సలహా సేవలు వీడియో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్ గోదావరి, కృష్ణా జలాల్లో రాష్ట్ర హక్కులు కాపాడేలా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని ఉత్తమ్ పేర్కొన్నారు. గోదావరి- బనకచర్ల ప్రాజెక్టుకు వ్యతిరేకమని ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పామని, కర్ణాటకలో ఆల్మట్టి ఎత్తు పెంపునకు కూడా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. కృష్ణా జలాల్లో 511 టిఎంసిలు ఎపి ప్రభుత్వం తీసుకోవచ్చని సంతకాలు చేసిందని, కృష్ణాజలాల్లో తెలంగాణకు కేవలం 299 టిఎంసిలు చాలని సంతకం చేసింది బిఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు. ఇప్పుడు కృష్ణా జలాల్లో 70 శాతం తెలంగాణకే కేటాయించాలని తాము వాదనలు వినిపిస్తున్నామని చెప్పారు. కృష్ణా బేసిన్ లో బిఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగా ఒక్క ప్రాజెక్టు కూడా కట్టలేదని, పదేళ్ల పాలనలో బిఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రమే నిర్మించిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.