ఉమ్మడి రాష్ట్రం లో మంజూరు అయిన పనులు ఇప్పటి వరకూ ఎందుకు పూర్తి చేయలేదు


                       * అధికారులను ప్రశ్నించిన జగ్గారెడ్డి *


సదాశివ పేట పట్టణం లోని కందకం రోడ్ పై  ఆర్ అండ్ బి, మున్సిపల్ అధికారుల తో  టీజిఐఐసి  చైర్ పర్సన్   నిర్మల , జగ్గారెడ్డి సమీక్ష


నేను వంట వండుతా.... మీరు తిని పొండి అంతే.... వంట  వండే వాడే గ్రేట్


 సంగారెడ్డి
అక్టోబర్ 11 (ఎక్స్ ప్రెస్ న్యూస్ ); ఉమ్మడి రాష్ట్రం లో మంజూరు అయిన పనులు  ఇప్పటి వరకూ ఎందుకు పూర్తి చేయలేదని టీజిఐఐసి  చైర్ పర్సన్  నిర్మల , జగ్గారెడ్డి ప్రశ్నించారు. శనివారం సదాశివ పేట పట్టణం లోని కందకం రోడ్ పై  ఆర్ అండ్ బి, మున్సిపల్ అధికారుల తో  టీజిఐఐసి  చైర్ పర్సన్   నిర్మల , జగ్గారెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈసందర్బంగా జగ్గారెడ్డి  మాట్లాడుతూ అధికారులను ప్రశ్నించిన జగ్గారెడ్డిసదాశివ పేట  పట్టణం లోని  కందకం రోడ్డు కు 20 కోట్లు 2014  లో నేనే తెచ్చిన, మళ్లీ ఇప్పుడు నేనే పూర్తి చేయాల్సి వస్తోందన్నారు.... కందకం రోడ్డు పొడవు   2.5 కిలో మీటర్లు.... కల్వర్టు ల తో సహా దాదాపు  పని పూర్తయింది... ఈశ్వర మంధిర్ దగ్గర ఏడు ఇళ్ళ తొలగింపు లో సమస్య ఉంది.... డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తామంటే వారు ఒప్పుకోవడం లేదు దానికి బదులుగా ఇంటి స్థలం, ఇల్లు నిర్మించి ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారని జగ్గారెడ్డి దృష్టికి తీసుకువచ్చిన అధికారులు, స్థానిక నాయకులు... కందకం రోడ్    2014   జనవరి లో ఉమ్మడి రాష్ట్రం లో మంజూరు అయితే, ఇప్పటి వరకూ ఎందుకు పూర్తి చేయలేక పోయారని అధికారులను జగ్గారెడ్డి ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రం లో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్య మంత్రి గా , మున్సిపల్ మంత్రి మహీధర రెడ్డి ఉన్నప్పుడు, స్పెషల్ జి ఓ తెచ్చి 20 కోట్లు మంజూరు చేయడం జరిగింది.... 11 సంవత్సరాల లో  15 కోట్లు ఖర్చు చేశారు, ఇప్పటికీ పూర్తి చేయలేక పోయారు....  2014 లో నేను ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు  కందకం రోడ్డు కోసం  20 కోట్లు తెస్తే    ఇంకా 5 కోట్లు పనులు ఈ 11 ఏళ్లలో పూర్తి చేయలేక పోయారు... 2014 లో నేను తెచ్చిన 20 కోట్ల జి ఓ కు, 11 ఏళ్ల తర్వాత మళ్లీ నేనే ఇప్పుడు రివ్యూ చేయాల్సి వస్తుందంటే సదాశివ పేట ప్రజలు ఆలోచించాలి...    ఇన్నేళ్లు ఏం చేశారని   అప్పుడు బి ఆర్ ఎస్   లో ఉన్న మాజీ  మున్సిపల్ చైర్మన్ లు సుభాష్, విశ్వనాథ్ లను జగ్గారెడ్డి ప్రశ్నించారు. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ దగ్గరకు వెళ్ళి ఎన్నో సార్లు అడిగామని,  ఆ కుంపటి  మనకెందుకు అని , వదిలేయమని చెప్పి పట్టించుకోలేదని జవాబిచ్చిన మాజీ చైర్మెన్ లు.... మంత్రి హరీష్ రావు దృష్టికి సైతం కందకం రోడ్డు విషయం తీసుకెళ్లామని , నిర్వాసితుల సమస్య తీర్చమని అడిగా మని మాజీ మున్సిపల్ చైర్మన్ లు సుభాష్, విశ్వనాథ్ లు....  జగ్గారెడ్డి కి వివరించారు. నిర్వాసితుల కు డబుల్ బెడ్ రూం లు తప్పా వేరే ఏ పరిహారం ఇచ్చేదిలేదని హరీష్ రావు చెప్పాడని , కందకం రోడ్ సమస్య ను ఇటు  చింతా ప్రభాకర్, అటు హరీష్ రావు పట్టించుకోలేదని తెలిపిన స్థానికులు.... 2014 లో నేను ఎమ్మెల్యే  ఉన్నప్పుడే కందకం పనులు ప్రారంభం అయ్యింది, కానీ ఇప్పటికీ పూర్తి చేయలేకపోయారు.... సదాశివ పేట ప్రజలు నాకు రెస్ట్ ఇచ్చారు...  సదాశివ పేట ప్రజలు  స్థానికుడు కాబట్టి చింతా ప్రభాకర్ కు ఓటేశారు,  ఆ విషయం లో నేనెప్పుడూ తప్పు పట్ట లేదు.... సదాశివ పేట కు నేను రావడం లేదని సదాశివ పేట నాయకులు అడుగుతున్నారని నిర్మల తెలిపింది.. సదాశివ పేట లో దసరా వేడుకలు జరుపుదామని రెండు మూడు సార్లు ప్రయత్నించిన,   ఇక్కడ పరిస్థితుల వల్ల సాధ్యం కాలేదు. ఇప్పుడు మా ప్రభుత్వం ఉంది, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు నా మాట వింటారు , నిధులు తెచ్చే అవకాశం ఉంది   కాబట్టి నేను మళ్ళీ కందకం రోడ్ పై రివ్యూ చేస్తున్న.... ఎనిమిది మంది నిర్వాసితుల కు  ఒక్కొక్కరికి 150 గజాల స్థలం, స్లాబ్ ఉన్నవారికి 15 లక్ష లు, రేకులు ఉన్నవారికి 10 లక్షల పరిహారం ఇచ్చేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచనలు చేసారు.   రోడ్ వెడల్పు లో  శివాలయం ను ముట్టుకోవడ్డు, ఈ విషయాన్ని నేను 2014 లోనే చెప్పిన, శివాలయానికి  ఇబ్బంది లేకుండా పనులు జరగాలి... జాతీయ రహదారి ఆనుకుని, బస్టాండ్ ఎదురుగా ఉన్న నాలుగు షాప్ లు తొలగించాలని కోర్టు కేసు ఉందని జగ్గారెడ్డి కి అధికారులు వివరించారు. వారికి  కావాల్సిన పరిహారం ఎంత? వారు ఏం కోరుకుంటున్నారో తెల్సుకుని ప్రతిపాదన సిద్దం చేయాలని అధికారులకు జగ్గారెడ్డి సూచించారు. జ్యోతి టాకీస్ ,   దుర్గమ్మ గుడి , చిన్న గంజి రోడ్ , కుమ్మరి ఖేరి, వెంకటపూర్ రోడ్, ఈశ్వర్  మందిర్, బంగారు మైసమ్మ , ఎనికేపల్లి రోడ్, నేషనల్ హైవే రోడ్ వద్ద జంక్షన్ లు ఏర్పాటు కు ప్రతిపాదన సిద్దం చేయాలని ,  కోర్టు కేసులు ఉన్న ప్లేస్ లలో వదిలేసి మిగతా చోట పనులు వెంటనే ప్రారంభించాలని అన్నారు. పనులు అయ్యే లోపు  కోర్టు కేసులు, పరిహారం సమస్యలను పరిష్కరిద్ధామని అధికారులకు చెప్పిన జగ్గారెడ్డి.... ఈ కందకం రోడ్డు మొత్తం పూర్తయితే సదాశివ పేట రూపు రేఖలు మారిపోతాయి, డివైడర్, సెంట్రల్ లైటింగ్ తో ఒక నెక్లెస్ రోడ్ గా మారిపోతుందిచేసే పని ఏదైనా ఓట్ల తో సంబంధం పెట్టకూడదు, మనం బలహీనులం కాదని ఈ విషయం దృష్టి లో పెట్టుకోవాలని కార్యకర్తలకు సహితం   జగ్గారెడ్డి సూచించారు. నాకు రెండు రైట్స్ ఉన్నాయి, ఒక మాజీ ఎమ్మెల్యే గా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి నిధుల విషయం లో    లేఖ రాసే అధికారం ఉంది. .... జిల్లా అధికారులకు కార్పొరేషన్ చైర్ పర్సన్ గా అధికారికంగా   నిర్మల లేఖలు ఇస్తుంది  ఈ విషయం సదాశివ పేట ప్రజలు,  మీడియా గమనించాలి... ఈ పదేళ్లలో సీఎం సదాశివ పేట కు వచ్చాడా అని స్థానికులను  ప్రశ్నించిన జగ్గారెడ్డి... రాలేదు అని సమాధానం ఇచ్చిన స్థానికులు.... నా హయాం లో    సదాశివ పేట కు రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి నీ తీసుకువచ్చా ..... అదీ  జగ్గారెడ్డి కెపాసిటీ..... కందకం రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయండి, సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయిస్తా.... ముఖ్య మంత్రి నీ నేనే పిలిపిస్తా కానీ నేను మాత్రం రాను.... నేను వంట వండుతా.... మీరు తిని పొండి అంతే.... వంట  వండే వాడే గ్రేట్ అని అన్నారు.