ఆహారం అనేది నిత్య జీవితంలో ఒక భాగం


ఆరోగ్యకరమైన ఆహారము ఎంతో అవసరం


తెలంగాణ ప్రభుత్వ మాజీ కార్యదర్శి  రాజా సదారం

హైదరాబాద్ అక్టోబర్ 16 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );ఆహారం అనేది నిత్య జీవితంలో ఒక భాగం అని,ఆరోగ్యకరమైన ఆహారము చాలా అవసరమని తెలంగాణ ప్రభుత్వ మాజీ కార్యదర్శి  రాజా సదారం అన్నారు. ఆహారం పై  పిల్లలకు అవగాహన కల్పించడం శుభపరిణామం అన్నారు.  హైదరాబాద్ బేగంపేట లోని కలినారి అకాడమీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ చెఫ్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మాజీ కార్యదర్శి రాజా సదారం, కలినారి ఆఫ్ ఇండియా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అక్షయ కులకర్ణి, కలినారి అకాడమీ ఆఫ్ ఇండియా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు ...ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనే దానిపై అవగాహన కల్పించడంతోపాటు రక్తదాన శిబిరం నిర్వహించారు. ప్రతి ఏడాది అక్టోబర్ 20 న ఇంటర్నేషనల్ చెఫ్ డే నిర్వహిస్తున్నారు  ప్రతి సంవత్సరం ఒక్కొక్క థీమ్ తో నిర్వహిస్తారు. ఏడాది ఫుడ్ ఎక్స్ ఫ్లోర్  థీమ్ పేరుతో నిర్వహిస్తున్నట్లు కలినారి అకాడమీ అకాడమీ   ఆఫ్ ఇండియా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అక్షయ కులకర్ణి తెలిపారు. ఆరోగ్యకరమైన ఆహారం  ఏ విధంగా తయారు చేసుకోవాలి.... ఎలాంటి ఆహారం ఆరోగ్యం ఇస్తుంది అనే విషయాలను పిల్లలకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. ఆరోగ్యకరమైన  ఆహారం ఎలా తయారు చేసుకోవాలో .... పిల్లలకు తయారీ చేసి చూపించినట్లు  ఆయన చెప్పారు. మరి ముఖ్యంగా మంచి ఆరోగ్యం ఉండాలంటే మిల్లెట్స్ ప్రధాన భూమిక పోషిస్తాయని తెలిపారు.   భవిష్యత్తులో మంచి ఆరోగ్యాన్ని పిల్లలకు అందించాలన్నదే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం అని ఆయన వివరించారు.