బీసీ రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేయాలి

తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్


హైదరాబాద్  అక్టోబర్ 15 (ఎక్స్ ప్రెస్ న్యూస్ ) : విద్యాఉద్యోగస్థానిక ఎన్నికలలో 42 శాతం రిజర్వేషన్లను అమలు చేసి 9వ షెడ్యూల్లో అమలు చేసి పార్లమెంట్ లో రాజ్యాంగ సవరణ చేయాలని ఓబీసీ మేధావుల ఫోరం వ్యవస్థాపక చైర్మెన్ ఆళ్ల రామకృష్ణతెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ డిమాండ్ చేశారు.  బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. బీజేపీకాంగ్రెస్ జాతీయ పార్టీలు  అన్నిటితో మద్దతు కూడగట్టి భారత రాజ్యాంగాన్నీ సవరించే విధంగా కృషి చేయాలన్నారు.రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ రాష్ట్ర హై కోర్టు స్టే విధించడం సరికాదన్నారు.మహారాష్ట్రబీహార్కర్ణాటకమద్రాస్ హైకోర్టులు ఇచ్చిన తీర్పులు ఇక్కడ అవగత మవుతున్నాయి స్పష్టం చేశారు. తమిళనాడు రిజర్వేషన్లు 9వ షెడ్యూల్ చేర్చారని గుర్తు చేశారు. రిజర్వేషన్లను పార్లమెంట్ లో సమావేశపరిచి లోకసభరాజ్యసభ ల్లో బిల్లును పాస్ చేసి రాష్ట్రపతితో సంతకం  చేపట్టి అమలు చేపట్టాలన్నారు.. ఈ సందర్బంగా  కార్య చరణ ప్రణాలికను ప్రకటించారు.23-10-2025,రోజున రాజ్ భవన్ ముట్టడి,25-10-2025ప్రజా సంఘాలుబీసీ సంఘాలుఎస్సీ. ఎస్ష్టి,సంఘాలతో  భవిష్యత్తు కార్యాచరణప్రణాళిక,కోసం రౌండ్ టేబుల్ సమావేశం,26-10-2025,ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల ముందు ప్రదర్శన,28-10-2025 న రాష్ట్ర బీజేపీ కార్యాలయం ముట్టడికేంద్ర మంత్రుల ఇళ్ల ముట్టడి కార్యక్రమం,తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పెద్దఎత్తున చేపడుతామన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్ర శ్రీహరి గౌడ్గిరగాని భిక్షపతికడబోయిన మల్లేష్ యాదవ్ రాష్ట్ర కార్యదర్శిఎర్రం సంజీవ రాష్ట్ర కార్యదర్శిదొంగ్లి శ్రీనివాస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు,పులియ గారి సరితా అంబాదాస్ రాష్ట్ర ఉపాధ్యక్షులుజ్యోతి గౌడ్ మహిళ కార్యదర్శిసంతోషి మాత బీసీ మహిళా సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి కలల్ నర్సింలు గౌడ్ బీసీ సంక్షేమ సంఘరాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు