పీర్ల సొమ్మును కాజేసి కటకటాల పాలైన ప్రబుద్ధులు
జిల్లా ఎస్పీ రావుల గిరిధర్
దొంగతనం చేసిన వ్యక్తే పిర్యాదు చేసిన వైనం
9.310 కిలోల వెండి ఆభరణాలు, 13.5 కిలోల ఇత్తడి పీర్లు, ఆల్టో కారు, బజాజ్ డిస్కౌవరీ బైక్ స్వాధీనం
వనపర్తి అక్టోబర్ 10 ఆయుధం న్యూస్
మంత్రాలు, జాతకాలు వంటివి చేసి వచ్చే సంపాదనతో తృప్తి చెందక దేవుళ్ళ సొమ్ము కాజేసి తిరిగి జాతకం చెప్పి తన మహిమతో సొమ్ములు గుర్తించినట్లు ప్రజలను నమ్మించి దగా చేయడానికి కుట్ర చేసిన నిందితులు పోలీసులకు దొరికి పోయారు.
శుక్రవారం రోజు సాయంత్రం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ వివరాలు వెల్లడించారు.
బెక్కెం గ్రామం చిన్నంబావి మండలంలో తేదీ 7.10.2025 నాడు తెల్లవారుజాము అందాజ 02:30 గంటల సమయం లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు పీర్ల దావిడిలో ఉన్న ఇతడి పీర్లు(8), వెండి గొడుగులు (20), ఉయ్యాలలు (08), చైన్లు (04), కంటాలు (10), గుర్రాలు (05) దొంగతనం చేసినారు. వాటి విలువ 2,16,000/- అని దరఖాస్తు రాగా కేసు నమోదు చేశారు
నేరస్తులు తేదీ 21.9.2025 అమావాస్య రోజున మధ్య రాత్రి పీర్ల దావిడి వున్న తాళం తీసి తీసి చెక్కపేటలో కట్టి ఉంచిన పీర్లను మరియు వెండి ఆభరణాలను దొంగిలించి ఫిర్యాదారుడు / నేరస్తుడి కారులో పెట్టుకొని, అనంతరం పీర్లదావిడికి తాళం వేసి పాషా అడ్డకల్ మండలం కందూర్ లో ఉన్న తన ఇంటిలో పెట్టుకున్నాడు. మరలవారు దొంగతనం చేసిన విషయము గ్రామస్తులకు ఎవరికి తెలియకపోవడంతో ఎలాగైనా గ్రామస్తులు తెలియజేయాలని తేదీ 7.10.2025 రోజున తెల్లవారుజామున అందాజా రెండున్నర గంటల సమయంలో నేరస్తులు కలిసి తాళం తీసి పీర్ల చావిడిలో వస్తువులను చిందరవందర చేసి సీసీ కెమెరాలు పగలగొట్టి పోలీసు కుక్కలు గుర్తు పట్టకుండా ఉండాలని పీర్లదావిడిమందు ముందే తెచ్చుకున్న కారం పొడిని చల్లి అటు నుంచి ఇంటికి వెళ్ళిపోయి ఎవరికి అనుమానం రాకుండా పీర్ల చావిడ్లో దొంగతనం జరిగిందని పోలీసు వారికి తప్పుడు దరఖాస్తు ఇచ్చినారు.
జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఆదేశాల మేరకు వెంటనే వనపర్తి డిఎస్పీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలోప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి పాషా అతని స్నేహితులను మరియు గ్రామంలోని ఇతర పేర్లు పెట్టి వారిని, కొంత మంది గ్రామస్తులను వివిధ కోణాల్లో తమదైన శైలిలో విచారణ చేయగా నేరస్థుడు పాషా పై అనుమానం రాగా వారిని విచారించగా వారు నేరం చేసినట్టు ఒప్పుకోవడం జరిగింది. తరువాత అతని వద్ద దొంగిలించిన సొత్తును స్వాధీనపరుచుకొని, అరెస్టు చేయడమైనది.ఈరోజు రిమాండ్ కు తరలించడం జరుగుతుంది.
A1) షామీర్ పాషా A2) మందాడి శివకృష్ణ A3) వనమల మురళీధర్ A4) అనుకలి మహేష్,అందరిది బెక్కెం గ్రామం, చిన్నంబావి మండలం.
ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ చూపిన వనపర్తి సీఐ, కృష్ణయ్య, సిసిఎస్ ఎస్సైలు, రామరాజు, జయన్న ,చిన్నంబావి ఎస్సై జగన్ మోహన్, వనపర్తి పట్టణ 2వ ఎస్సై, శశిధర్ , క్లూస్టీం ఎస్సై, రవి సాగర్, పోలీసు సిబ్బందిని ఎస్పీ క్యాష్ రివార్డ్ అందజేసి ప్రత్యేకంగా అబినధించారు.
నేరస్తుని నుండి స్వాదీనం చేసుకున్న వెండి ఆభరణాలు, ఇత్తడి పీర్లు
9.310 కిలోల వెండి
13.680 కిలోల ఇత్తడి
ఆల్టో కారు బజాజ్ డిస్కవరీబైక్ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో వనపర్తి డిఎస్పి వెంకటేశ్వరరావు వనపర్తి సిఐ కృష్ణయ్య చిన్నంబాయి ఎస్సై జగన్మోహన్ సిసిఎస్ ఎస్సైలు, జయన్న, రామరాజు పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.