91 శాతం మైక్రోఫైనాన్స్ రుణాలూ, జనం డబ్బు సంపాదించుకునే పనులకే
పెడుతున్నారు - సా-ధన్ భారత్ మైక్రోఫైనాన్స్ నివేదిక
· ఒక్కో వ్యక్తికి సగటున రూ.38,005 రుణ బాకీగా ఉంది. అందులో 91 శాతం డబ్బు వాళ్లు ఉపాధి కోసం.
· బ్యాంకుల ద్వారా మహిళా బృందాలకు ఇచ్చిన రుణాల్లో పెరుగుదల కనిపించింది. దేశవ్యాప్తంగా 84.9 లక్షల ఎస్ జిహెచ్ జి లకి కలిపి రూ.3.04 లక్షల కోట్ల రుణాలు బాకీగా ఉన్నాయి.
· 2024–25 మార్చి చివరి వరకు మైక్రోఫైనాన్స్ సేవలు వినియోగిస్తున్న వారు 8.28 కోట్ల మందిగా ఉన్నారు. వారికి మొత్తం రూ.3.81 లక్షల కోట్ల రుణాలు బాకీగా ఉన్నాయి.
· రుణ పరిమితులు మరియు పరిశ్రమ నియంత్రణల వల్ల మైక్రోఫైనాన్స్ రంగం 14 శాతం తగ్గింది. అయితే ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం లో ఇది తిరిగి వృద్ధి పథంలోకి వస్తుందని నిపుణులు భావిస్తున్నారు.
ముంబాయి 10 అక్టోబర్ 2025: మైక్రోఫైనాన్స్ రంగం 2024-25 ఆర్థిక సంవత్సరానికి గణాంకాలు. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీల (సిఐసిఎస్) సమాచారం ప్రకారం, 2024-25 ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి మైక్రోఫైనాన్స్ రంగంలో మొత్తం యాక్టివ్ ఖాతాదారుల సంఖ్య 8.28 కోట్లు, అలాగే మొత్తం రుణ బాకీ రూ.3,81,225 కోట్లుగా ఉంది. ఈ గణాంకాల్లో బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు (ఎస్ఎఫ్బిఎస్), నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్బిఎఫ్సిఎస్), ఎన్ బి ఎఫ్ సి -మైక్రోఫైనాన్స్ సంస్థలు (ఎంఎఫ్ఐఎస్) మరియు ఇతర రుణదాతల డేటాను కూడా చేర్చారు. మొత్తంగా పరిశీలిస్తే, మైక్రోఫైనాన్స్ రంగంలో ఖాతాదారుల సంఖ్యలో 13%, అలాగే రుణ బాకీ పరంగా 14% తగ్గుదల చోటుచేసుకుంది. స్వయం సహాయక బృందాల (ఎస్హెచ్జి) బ్యాంక్ లింకేజ్ వృద్ధి దిశగా నాబార్డ్ ప్రకారం, 84.94 లక్షల ఎస్ హెచ్ జి ఎస్ బ్యాంకులతో క్రెడిట్-లింక్ అయ్యాయి, వీటికి సంబంధించిన మొత్తం రుణ బాకీ ₹3.04 లక్షల కోట్లుగా ఉంది. అదే సమయంలో, దేశవ్యాప్తంగా 143.3 లక్షల ఎస్ హెచ్ జి ఎస్ పనిచేస్తుండగా, వాటి ద్వారా 17.1 కోట్ల కుటుంబాలు సేవింగ్స్ లింకేజ్ ద్వారా బ్యాంకింగ్ వ్యవస్థతో అనుసంధానమయ్యాయి.
సిఆర్ఐఎఫ్ హైమార్క్ తెలిపిన వివరాల ప్రకారం, 2025 మార్చి 31 నాటికి దేశంలో మొత్తం మైక్రోఫైనాన్స్ రుణ ఖాతాల సంఖ్య 13.99 కోట్లుగా ఉంది. ఈ రోజుకు రుణ బాకీ మొత్తం ₹3,81,225 కోట్లుగా ఉండగా, ఇందులో వివిధ సంస్థల వాటా ఇలా ఉంది. ఎన్ బిఎఫ్ సి –ఎంఎఫ్ఐఎస్ వద్ద ₹1,48,419 కోట్లు రుణ బాకీ ఉండి ఇది మొత్తం లో 39 శాతం. బ్యాంకులు ₹1,24,431 కోట్లతో 32 శాతం వాటాను కలిగి ఉన్నాయి. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు వద్ద ₹59,817 కోట్లు (16%), ఎన్ బి ఎఫ్ సి ఎస్ వద్ద ₹45,042 కోట్లు (12%) మరియు ఇతర సంస్థలు ₹3,516 కోట్లు (1%) బాకీగా ఉన్నాయి. ఇలా రుణ ఖాతాల పరంగా చూస్తే, ఎన్ బి ఎఫ్ సి – ఎంఎఫ్ఐసి 539 లక్షల ఖాతాలతో 39 శాతం వాటాను కలిగి ఉన్నాయి. బ్యాంకులు 466 లక్షల ఖాతాలతో 33 శాతం వాటా, ఎస్ ఎఫ్ ఎఫ్ బి ఎస్ 216 లక్షల ఖాతాలతో 15 శాతం, , ఎన్ బి ఎఫ్ సి ఎస్ 163 లక్షల ఖాతాలతో 12 శాతం మరియు ఇతరులు 15 లక్షల ఖాతాలతో 1 శాతం వాటా కలిగి ఉన్నాయి. ఈ గణాంకాల ప్రకారం, మైక్రోఫైనాన్స్ రంగంలో ఎన్ బి ఎఫ్ సి –ఎంఎఫ్ఐఎస్ మరియు బ్యాంకుల ప్రాధాన్యత స్పష్టంగా కనిపిస్తోంది. వీటివల్లే రంగం గణనీయంగా ముందుకు సాగుతోంది.
ఇవి భారత్ మైక్రోఫైనాన్స్ నివేదిక 2025లో పొందుపరిచిన ముఖ్యమైన విషయాలు. ఈ నివేదికను సా-ధన్, నాబార్డ్ సహకారంతో సిద్ధం చేసింది. ఇది మైక్రోఫైనాన్స్ రంగంపై ప్రామాణికమైన, సమగ్ర సమాచారం అందించే ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ నివేదికలో పొందిన డేటా క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీల నుంచి తీసుకోవడంతో పాటు, దేశవ్యాప్తంగా ఉన్న 203 మైక్రో లెండింగ్ సంస్థల నుంచి నేరుగా సేకరించబడింది. ఇవి కలిపి దేశవ్యాప్తంగా ఉన్న ఎంఎల్ఐ వ్యాపారంలో 98 శాతానికి పైగా ప్రతినిధ్యం వహిస్తున్నాయి. ఈ నివేదిక మైక్రోఫైనాన్స్ రంగంలోని తాజా పరిస్థితులు, వృద్ధి ధోరణులు, మరియు సంస్థల భాగస్వామ్యాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే విశ్వసనీయ వనరుగా నిలుస్తోంది.
భారత్ మైక్రోఫైనాన్స్ నివేదిక 2025 పై నాబార్డ్ చైర్మన్ శాజీ కె.వి.మాట్లాడుతూ "మైక్రోఫైనాన్స్ భారతదేశపు సామాజిక-ఆర్థిక పరివర్తనకు మూలస్తంభంగా ఎదిగింది. ఇది ఆర్థిక వ్యవస్థలో ప్రతి ఒక్కరికీ అవకాశాన్ని కల్పించడంమే కాకుండా, మహిళలు, చిన్న మరియు సన్నకారు రైతులు, చేతివృత్తి కార్మికులు, ఇతర బలహీన వర్గాలను సాధికారత దిశగా నడిపిస్తోంది. లక్షలాది మంది ప్రజలు సమయానుకూలంగా, భద్రత లేకుండానే రుణాలను పొందగలిగారు. దీని ద్వారా వారు జీవనోపాధిని స్థిరపర్చుకోవడం, స్వయం ఉపాధి అవకాశాలు ఏర్పరచుకోవడం సాధ్యమయ్యింది. డేటా ఆధారిత విశ్లేషణతో, భారత్ మైక్రోఫైనాన్స్ నివేదిక మన మైక్రోఫైనాన్స్ రంగంపై కలిగిన సమిష్టి అవగాహనను మరింత లోతుగా చేస్తుంది. 'వికసిత్ భారత్' లక్ష్య సాధనలో మైక్రోఫైనాన్స్ ఒక కీలక ప్రేరక శక్తిగా ఉన్నదని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది."
సా-ధన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, మరియు సీఇఓ జిజి మామెన్ వ్యాఖ్యానించారు. "మైక్రోఫైనాన్స్ రంగంలో ప్రస్తుతం ఎదురవుతున్న ఒత్తిడికి ప్రధాన కారణంగా చర్చకు వస్తున్న అంశం అదుపు లేకుండా సాగుతున్న రుణ భారం. ఇది ఎక్కువ రుణదాతలు మార్కెట్‌లోకి రావడం, మరియు రుణగ్రాహకులపై అధిక భారం పడటం వల్ల చోటు చేసుకుంది. ఈ పరిస్థితిని ముందుగానే గమనించిన పరిశ్రమ నేతలు మరియు స్వచ్ఛంద నియంత్రణ సంస్థలు అదనపు నియంత్రణ చర్యలు తీసుకువచ్చారు. మొదటి దశ నియంత్రణలు 2024 జూలైలో, రెండవ దశ 2025 ఏప్రిల్‌లో అమలులోకి వచ్చాయి. ఈ నియంత్రణల వల్ల రుణాల విస్తరణపై కొంత నియంత్రణ కలగడంతో, మైక్రోఫైనాన్స్ రంగంలో వృద్ధిలో మందగమనం వచ్చిందని చెప్పవచ్చు. ఎంఎఫ్ఐఎస్ కి రుణాలపై వచ్చిన పరిమితులూ కూడా ఈ ప్రతికూల వృద్ధికి కారణం. అయితే, ప్రస్తుతం తీసుకుంటున్న నిర్ణయాలు మరియు 91 శాతం రుణాలు ఆదాయ ఆదాన కార్యకలాపాలకే ఉపయోగించబడుతున్నాయి అన్న విషయం ఆధారంగా చూస్తే, ఈ ఆర్థిక సంవత్సరం నుంచే పరిస్థితి మెరుగవుతుందని అంచనా."
About Sa-Dhan
Sa-Dhan is an association of Impact Finance Institutions and an RBI-appointed Self-Regulatory Organisation (SRO) for Microfinance Institutions. Sa-Dhan is the first and largest association of community development finance institutions in India, established over two decades ago to support and strengthen the agenda of fostering Inclusive Impact Finance in India. It aims to foster a deeper understanding of the microfinance sector among policymakers, funders, banks, governments, researchers, and practitioners. Sa-Dhan has about 220 members working in 33 states/UTs and over 723 districts, which include both for-profit and not-for-profit MFIs, SHG-promoting institutions, banks, rating agencies, capacity-building institutions, etc. Sa-Dhan’s members with diverse legal forms and operating models reach out to approximately 63 million clients with a loan outstanding of more than ₹2,27,410 crore. Sa-Dhan is also recognised as a National Support Organisation (NSO) by the National Rural Livelihood Mission (NRLM).