రిజర్వేషన్లపై మూడు రాజకీయ పార్టీలు మూడు ముక్కల ఆట
టీ టిడిపి రాష్ట్ర కార్యదర్శి రామన్ గౌడ్
వనపర్తి అక్టోబర్ 10 ఆయుధం న్యూస్ 42 శాతం రిజర్వేషన్లపైన మూడు రాజకీయ పార్టీలు
మూడు ముక్కల ఆట ఆడుతున్నాయని తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఎస్. రామన్ గౌడ్ విమర్శించారు
కాంగ్రెస్ పార్టీ మేము చేయాల్సింది చేశాము ఇక చేయాల్సింది బీజేపీ ప్రభుత్వం అని..
బీజేపీ పార్టీ బీసీ కులగణ లో ముస్లింలు ఉన్నారు అందుకే
ఇవ్వలేమని
బి అర్ ఎస్ పార్టీ గోడ మీద పిల్లిలా ఎటు తేల్చుకోలేకపోతుంది
బిసి లకు అన్ని విధాలుగా సరైన న్యాయం జరిగింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం లో ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలోనే గుర్తుచేశారు
తెలంగాణ రాష్టంలో 60 శాతం ఉన్న బిసిలను78 ఏళ్లుగా అన్ని రంగాల్లో అణిచివేతకు గురి చేస్తూ విద్య వైద్య ఉద్యోగం ఉపాధి రంగాలతో పాటు రాజకీయ రంగంలో జనాభా నిష్పత్తి ప్రకారం వనరులు రాకుండా రాజకీయ అధికారం లేకుండా స్వతంత్ర భారత దేశంలో అణిచివేసేందుకు కొనసాగుతున్న కుట్రలో భాగమే అని బీసీ కులాల పోరాటాల ఫలితంగా 42 శాతం తో బిసిలకు రాష్ట ప్రభుత్వం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ తెచ్చిందని టీ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఎస్. రామన్ గౌడ్ అన్నారు.ఈ రోజు రాష్ట హైకోర్టు ఇచ్చిన తీర్పు చూస్తే బీసీ రిజర్వేషన్ పై జి ఓ ఇచ్చింది రెడ్డి ప్రభుత్వం అడ్డుకుంటుంది రెడ్డి జాగృతి అనేది స్పష్టంగా అర్థం అవుతుందని ఇప్పటికైనా ఈ అగ్రవర్ణ పార్టీలకు చెంచాలుగా మారిన కొందరు బీసీ నాయకులు సోయి తెచ్చుకోవాలని రామన్ గౌడ్ అన్నారు
రాష్ట ప్రభుత్వం జివో 9 ని తెచ్చిన అది నిలబడదుఅని రాజకీయ పునరేకీకరణ ద్వారా మాత్రమే సాధ్యం అని తెలిసిన కాలయాపన చేస్తూ అట్టి రిజర్వేషన్ పై హైకోర్టులో స్టె రావడానికి కారణం పాలక కాంగ్రెస్ తో పాటు ఈ దోపిడీ అగ్రవర్ణ ఆధిపత్య పార్టీ లైన బీజేపీ బిఆర్ఎస్ పార్టీల పాత్ర ఉందని ఇది బహుజన బీసీ సమాజం యొక్క ఆత్మగౌరవం పై సాగుతున్న దాడి అని మండి పడ్డారు
బిసి రిజర్వేషన్ 42శాతం రాజ్యాంగం లోని 9 వ షెడ్యూల్ లో చేర్చితేనె రక్షణ ఉంటుందoని తెలిసిన ఈ దోపిడీ అగ్రవర్ణ పాలక ప్రతిపక్ష పార్టీలకు చీమ కుట్టినట్లుగా లేకుండా వ్యవహారించాయని ఈ కుట్రల ఫలితమే హైకోర్టు స్టే అని అందుకే రాబోయే రోజుల్లో బీసీ సమాజం ఈ అగ్రవర్ణ పార్టీల కుట్రలు తెలుసుకొని ఆ పార్టీల జెండాలు మోస్తు జై కొట్టటం మానుకోవాలని అన్నారు.