వనపర్తి, ఆయుధం ప్రతినిధి(పోలిశెట్టి బాలకృష్ణ)
స్థానిక ఎన్నికల్లో బీసీ 42 రిజర్వేషన్స్ మీద జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయాధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య నేతృత్వంలో హైదరాబాద్ లో జరిగిన బీసీ సంఘాల సమావేశంలో ఈనెల 14వ తేదీన రాష్ట్ర బందుకు నిర్ణయం తీసుకున్నారని వనపర్తి జిల్లా కేంద్రంలోని జాతీయ బీసీ సంఘం జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి అరవింద్ స్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శి ముకుంద నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి అరవిందస్వామి, వనపర్తి జిల్లా ప్రధాన కార్యదర్శి ముకుంద నాయుడు మాట్లాడుతూ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎన్నికలపై స్టే విధించడం దేశ చరిత్రలో ఇదే మొదటి సారి అని ఇది బీసీలకు బాధాకర విషయమన్నారు. రాష్ట్ర బంద్ కు బీసీ లందరూ కలిసి రావాలని అలాగే బీసీ రిజర్వేషన్లకు మద్దతు తెలిపే అన్ని రాజకీయ పార్టీలు బీసీ సంఘాలు కుల సంఘాలు ప్రజాసంఘాలు అందరూ కలిసి రావాలని బందులో పాల్గొనాలని పిలుపునిచ్చారు. బిసి రిజర్వేషన్ల అంశం గవర్నర్ దగ్గర కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్లో ఉందో దాన్ని చట్టబద్ధత పొందే వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడానికి వీల్లేదని అఖిలపక్షం బీసీ సంఘాలతో పార్లమెంటు ఢిల్లీ స్థాయిలో రిజర్వేషన్లపై పోరాడి అంతిమంగా ప్రక్రియను పూర్తి చేసి ఎన్నికలు నిర్వహించాలని అంతవరకూ బీసీ సంఘాలు ఉద్యమం కొనసాగిస్తాయని తెలిపారు. ఎవరు అడ్డు వచ్చినా బీసీల నుంచి ప్రతిఘటన తప్పదని ప్రతి ఒక్క పార్టీ కార్యాచరణకు మద్దతుగా నిల్వాల్సిందేనని తెలిపారు. జీవో ఇచ్చేది రెడ్డినే జీవోకు అడ్డు వచ్చేది రెడ్డినే అని అధికారంలో ఉండేది ఓసీలు అధికారం అనుభవిస్తూ బీసీలకు తోడుగా ఉంటాం మేము బీసీల పక్షం అని చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు. బీసీలకే అధికారం ఉంటే మీరు బీసీలకు అండగా ఉండాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. వనపర్తి జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా బీసీల పక్షాన నిలుస్తూ బందును విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ముకుంద నాయుడు, ఉపాధ్యక్షుడు చిట్యాల రాములు, చిన్నం బావి మండలం రామకృష్ణ, లోకేష్ పాల్గొన్నారు.