ప్రజా సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్ లో ప్రతి (సోమవారం) నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని నెల 13 నుంచి యధావిధిగా నిర్వహిస్తున్నట్లు వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభితెలిపారు....
స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉండటం వల్ల తాత్కాలికంగా గతవారం ప్రజావాణి కార్యక్రమాన్ని వాయిదా వేయాల్సి వచ్చిందని ప్రస్తుత స్థానిక ఎన్నికల నిర్వహణ ప్రక్రియ నిలిచిపోయినందున ప్రజావాణి కార్యక్రమాన్ని తిరిగి యధావిధిగా ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై దరఖాస్తును సమర్పించవచ్చని తెలిపారు.....