120 మంది నక్సల్స్ తో కలిసి లొంగిపోనున్న ఆశన్న..!


హైదరాబాద్ అక్టోబర్ 16 (ఎక్స్ ప్రెస్ న్యూస్  ); : మావోయిస్టు అగ్రనేత ఆశన్న పోలీసుల ఎదుట లొంగిపోనున్నాడు. ఆశన్న అలియాస్ రూపేష్ సుమారు 120 మంది నక్సల్ తో కలిసి పోలీసుల ఎదుట లొంగిపోయే అవకాశం ఉంది. ములుగు జిల్లాకు చెందిన ఆశన్న1991 లో పీపుల్స్ వార్ పార్టీలో చేరారు. 1999 లో పీపుల్స్ వార్ యాక్షన్ టీం అధిపతిగా నియామకమయ్యారు. 2003లో అలిపిరిలో అప్పటి సిఎం చంద్రబాబు నాయుడు కాన్వాయ్ పేల్చివేత, 2000 అప్పటి హోంమంత్రి మాధవరెడ్డిని చంపిన ఘటనలో ప్రధాన నిందితుడిగా ఆశన్న ఉన్నారు. రెండు రోజుల క్రితం మహారాష్ట్రలోని గడ్చిరోలిలో మల్లోజుల వేణుగోపాల్ 60 మంది మావోయిస్టులతో పాటు పెద్ద ఎత్తున ఆయుధ సామాగ్రితో మంగళవారం గడ్చిరోలి పోలీసుల ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే.