తన దేశవ్యాప్త విస్తరణతో స్వాతంత్ర్యోత్సవాన్ని ఘనంగా జరుపుకున్న ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్

 


ఆగస్టు 
15న 51 కొత్త శాఖలను ప్రారంభించిఏయూ ఎస్‌ఎఫ్‌బీ సమగ్ర బ్యాంకింగ్ లక్ష్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్తోంది


ముంబైఆగస్టు 14, 2025: ఇండియాలోనే అతిపెద్ద స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌గాఅలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి యూనివర్సల్ బ్యాంక్‌గా మారేందుకు ‘ఇన్-ప్రిన్సిపల్’ ఆమోదం పొందిన తొలి బ్యాంక్‌గా ఉన్న ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్ (“ఏయూ ఎస్‌ఎఫ్‌బీ”) ఈ రోజు దేశవ్యాప్తంగా 51 కొత్త శాఖలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ శాఖల ప్రారంభోత్సవం 2025 ఆగస్టు 15, భారత 79వ స్వాతంత్ర్య దినోత్సవం నాడు జరుగుతుంది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే కాకుండాసమగ్రత మరియు అందుబాటులో ఉండే బ్యాంకింగ్ ద్వారా సమాజాలను శక్తివంతం చేయాలనే ఏయూ ఎస్‌ఎఫ్‌బీ యొక్క సంకల్పాన్ని ప్రతిబింబించే ప్రతీకాత్మక చర్యగా నిలుస్తుంది.

ఈ విస్తరణలో 30 లైబిలిటీ బ్రాంచీలు మరియు 21 మైక్రోఫైనాన్స్ మరియు ఇన్‌క్లూజివ్ బ్యాంకింగ్ (ఎం.ఎఫ్.ఐ.బి.బ్రాంచీలు ఉంటాయి. ఇవి పశ్చిమ బెంగాల్గుజరాత్తెలంగాణమధ్యప్రదేశ్ఒడిశారాజస్థాన్తమిళనాడు వంటి అధిక వృద్ధి అవకాశాలు ఉన్న ప్రాంతాలలో వ్యూహాత్మకంగా ఏర్పాటు చేయబడ్డాయి. ఈ కొత్త బ్రాంచీలు డిపాజిట్లుచెల్లింపులువసూళ్ల పరిష్కారాలుట్రేడ్ ఫైనాన్స్ఇన్షూరెన్స్ఇన్వెస్ట్‌మెంట్ ప్రొడక్ట్స్ఆధునిక డిజిటల్ బ్యాంకింగ్ వంటి పూర్తి స్థాయి ఆర్థిక సేవలను అందిస్తాయి. అదనంగాఎం.ఎఫ్.ఐ.బి. బ్రాంచీలు సూక్ష్మ వ్యాపారాలు మరియు సరిగా సేవలు అందని వర్గాలకు ప్రత్యేక సహాయాన్ని అందిస్తాయి.

ప్రారంభోత్సవం సందర్భంగా ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డిప్యూటీ సీఈఓ శ్రీ ఉత్తమ్ టిబ్రేవాల్ మాట్లాడుతూ, ఈ విస్తరణ కేవలం మా బ్రాంచీల సంఖ్యను పెంచుకోవడమే కాదు — మేము సేవలందించే ప్రజల మరియు సమాజాల జీవితాల్లో మా ఉనికిని మరింతగా బలపరచడమే లక్ష్యం. ప్రతి కొత్త బ్రాంచ్ మా కస్టమర్లకు మరింత సమగ్రమైన బ్యాంకింగ్ అనుభవాన్ని అందించాలన్న మా దృష్టి వైపు మమ్మల్ని మరింత దగ్గర చేస్తుంది. యూనివర్సల్ బ్యాంక్‌గా మారేందుకు మాకు లభించిన ‘ఇన్-ప్రిన్సిపల్’ ఆమోదం అనేది విశ్వాసంశ్రద్ధమరియు అర్థవంతమైన ఆర్థిక పరిష్కారాలతో విభిన్న కస్టమర్ విభాగాలకు సేవ చేయాలన్న మా నిరంతర కృషికి నిదర్శనం. స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఈ 51 బ్రాంచ్‌లను ప్రారంభించడం అనేది ఆర్థిక స్వేచ్ఛా స్పూర్తికి మరియు సమగ్ర వృద్ధి పట్ల మా అంకితభావానికి నివాళి” అని అన్నారు.

ఈ వ్యూహాత్మక విస్తరణతోఏయూ ఎస్‌ఎఫ్‌బీ దేశంలోని విభిన్న ప్రాంతాల్లో తన ఉనికిని మరింత బలపరచుకునిసమగ్ర ఆర్థిక వృద్ధి వైపు భారత ప్రయాణంలో నమ్మకమైన భాగస్వామిగా తన పాత్రను మరోసారి నొక్కి వక్కాణించింది.