రూ.2,45,48,023 కోట్ల నగదుతో పాటు ,బంగారం,వెండి,విదేశీ కరెన్సీ
యాదగిరిగుట్ట, జూలై 23 (ఆయుధం న్యూ స్);: తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి 41 రోజుల హుండీలను బుధవారం లెక్కించారు . 38 గ్రాముల మిశ్రమ బంగారం, రెండు కిలోల 8 00గ్రాముల మిశ్రమ వెండి తో పాటు ₹ 2,45,48,023 ( రెండు కోట్ల నలబై ఐదు లక్షల నలభై ఎనిమిది వేల ఇరవై మూడు రూపాయలు) నగదు ఆదాయం హుండీల ద్వారా సమకూరినట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎస్. వెంకట్రావు ఒక ప్రకటనలో తెలిపారు. విదేశీ కరెన్సీ కూడా సమకూరినట్లు ఆయన వివరించారు.
అమెరికా- 1036 డాలర్లు,
ఆస్ట్రేలియా - 5 డాలర్లు, ఇంగ్లాండ్- 45 పౌండ్స్,
సౌదీ అరేబియన్ -5 రియల్,
సింగపూర్ - 10 డాలర్స్ ,
కతర్ - 1/2రియల్,
ఒమన్ - 500 బైస ,
అరబ్ ఎమిరేట్స్- 70 థీర మ్స్, శ్రీలంక - 500., మలేసియా - 23, రింగిట్స్, కెనడా - 20 డాలర్స్, బెహ్రిన్ - 2 . హుండీ లెక్కింపులో అనువంశిక ధర్మకర్త బి నరసింహమూర్తి కూడా పాల్గొన్నారు.