మక్తల్ శాసనసభ నియోజకవర్గం నుంచి బిజెపిలో పెద్దఎత్తున చేరికలు

కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తోంది

   రాబోయే రోజుల్లో మరింత ఉత్సాహంతో పార్టీ బలోపేతానికి పాటుపడాలి

       బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు పిలుపు


హైదరాబాద్ జూలై 23 (ఆయుధం  న్యూస్ );మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ శాసనసభ నియోజకవర్గం నుంచి వివిధ పార్టీలకు చెందినా నాయకులు  బిజెపిలో పెద్దఎత్తున చేరారు.పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలకు బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు   రాంచందర్ రావు  పార్టీ కండువా కప్పి ఆహ్వానం తెలిపారు.ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో మరింత ఉత్సాహంతో పార్టీ బలోపేతానికి పాటుపడాలి.తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తోంది.యూపీఏ హయాంలో యూరియా కోసం రైతులు బారులు తీరిన క్యూలైన్లలో గొడవలు జరిగి, లాఠీచార్జీలు జరిగిన అనేక ఘటనలు చూశాం.దేశంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యూరియా కొరత లేకుండా, ఆయా రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా యూరియా పంపిణీ జరుగుతోంది.అయినా ఇటీవల బిజెపిని బద్నాం చేయడానికి కొన్ని శక్తులు తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నాయి.రబీ సీజన్‌ కోసం తెలంగాణకు అవసరమైన యూరియా 9.5 లక్షల మెట్రిక్ టన్నులు. కేంద్రం సరఫరా చేసిన యూరియా: 12.02 లక్షల మెట్రిక్ టన్నులు. ఇది అవసరానికి మించి 2.5 లక్షల టన్నుల అదనపు సరఫరా.అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ఫెర్టిలైజర్ షాపుల ముందు రైతులు బారులు తీరిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే.కేంద్రం పంపిన ఎరువులను రాష్ట్రంలోని కొంతమంది బ్లాక్ మార్కెట్‌కి మళ్లిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే. కృత్రిమ కొరత, బ్లాక్ మార్కెట్, ఎరువుల డీలర్లపై సరైన మానిటరింగ్ లేకపోవడం, సరఫరా వ్యవస్థపై రాష్ట్ర వ్యవసాయ శాఖ నిర్లక్ష్యం.. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వ పాలనాపరమైన వైఫల్యానికి నిదర్శనం.యూరియా బ్లాక్ మార్కెట్‌ను అడ్డుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది.  తెలంగాణ రాష్ట్రానికి ఎంత మేర అవసరమో అంత మేర యూరియా ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉంది. అయినా రాష్ట్ర ప్రభుత్వం అబద్ధాల ప్రచారంతో రైతుల్లో అపోహలు సృష్టిస్తోంది.మహబూబ్ నగర్ జిల్లాలోని మక్తల్ వంటి ప్రాంతం కాటన్ సీడ్ బౌల్‌గా పేరుగాంచింది. అలాంటి ప్రాంతాల్లో కూడా కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఫెర్టిలైజర్ షాపులతో కుమ్మక్కై బ్లాక్ మార్కెట్‌కు పాల్పడుతున్నారు.పంచాయతీరాజ్ ఎన్నికల్లో బిజెపి నాయకులు, కార్యకర్తలు.. వార్డు మెంబర్ స్థాయి నుంచి జడ్పీటీసీ స్థాయివరకు సిద్ధంగా ఉండాలి.బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు బిజెపి డిమాండ్ చేస్తోంది. అయినా దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని బిజెపిపై కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేయడం సిగ్గుచేటు.బిజెపిపై తప్పుడు ప్రచారం చేయడమే కాంగ్రెస్ నాయకుల ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు.రాష్ట్రంలో బిజెపి కి మంచి వాతావరణం ఉంది. కాబట్టి నాయకులు, కార్యకర్తలు మధ్య ఎలాంటి మనస్ఫర్థలు లేకుండా కలిసిమెలిసి పని చేసి బిజెపిని గెలిపించాలి.బిజెపి మనకు తల్లిలాంటి పార్టీ. అలాంటి పార్టీకి ఎవరూ కూడా ద్రోహం చేయరాదు.మహబూబ్ నగర్ ఎంపీ స్థానంతో పాటు మున్సిపాలిటీలు, నారాయణపేట మున్సిపాలిటీ, మక్తల్ చైర్మన్‌ స్థాయిలలో బిజెపి విజయాలు సాధించింది.రానున్న రోజుల్లో బిజెపి రాష్ట్రంలో మరింత బలమైన వాతావరణం ఉంది. అందుకే కాంగ్రెస్ పార్టీ అబద్ధపు ప్రచారంతో ప్రజలను మభ్యపెడుతోంది.గతంలో నేను ఎమ్మెల్సీగా రాష్ట్రవ్యాప్తంగా సేవలందించాను. ఆ సమయంలో మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల ప్రజలు నాపై విశేష ఆదరణ చూపారు.రేపు (జూలై 24) మహబూబ్ నగర్ జిల్లాలో నా పర్యటనలో భాగంగా బిజెపి శ్రేణులంతా ఐక్యతను ప్రదర్శించి ప్రజల్లో మరింత విశ్వాసం పెంచాలి.కొత్తవారు, పాతవారు అనే భేదం లేకుండా నాయకులు, కార్యకర్తలు అందరూ కలసికట్టుగా పని చేసి బిజెపి ని అధికారంలోకి తీసుకురావడంలో కృషి చేయాలి.