భారత్‌కు అమెరికా వార్నింగ్
న్యూ డిల్లీ జూలై 22 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );భారత్‌కు అగ్రరాజ్యం అమెరికా మరోసారి కీలక హెచ్చరికలు జారీ చేసింది. రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటే 100 శాతం సుంకాలు విధించనున్నట్లు యూఎస్ సెనేటర్ లిండ్సే గ్రాహమ్ హెచ్చరించారు. భారత్ మాత్రమే కాకుండా రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేసే చైనా , బ్రెజిల్ వంటి దేశాలకు కూడా ఇలాంటి హెచ్చరికలే చేశారు. రష్యా నుంచి తక్కువ ధరకు ఆయిల్ కొనుగోలు చేసి యుద్ధం కొనసాగించేందుకు సహకరిస్తున్న దేశాల ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తామంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.