ఆలయాల నిర్మాణం కోసం అధ్యయనానికి దేశ వ్యాప్తంగా కమిటీ

* సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ ఏర్పాటుకు ఎపి ప్రభుత్వం ఆమోదం

* టిటిడి ఈఓ శ్యామలరావు వెల్లడి

తిరుపతి జూలై 22 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );: దేశ వ్యాప్తంగా ఆలయాల నిర్మాణం కోసం అధ్యయనానికి కమిటీ వేశామని టిటిడి ఈఓ శ్యామలరావు చెప్పారు. మంగళవారం తిరుపతిలో మీడియా తో మాట్లాడుతూ  సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ ఏర్పాటుకు ఎపి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని తెలిపారు. వైకుంఠ క్యూ కాంప్లెక్స్-3 నిర్మాణంపై కమిటీ, అలిపిరి దగ్గర మౌలిక సదుపాయాల కల్పనకు కమిటీ ఏర్పాటు చేశామన్నారు. శిలాతోరణం, చక్రతీర్థం అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నామని, ఒంటిమిట్ట ఆలయంలో  త్వరలోనే అన్నదానం ప్రారంభం అవుతుందని, రూ. 4.7 కోట్లతో అన్నదానం కోసం నూతన భవన నిర్మాణం జరుగుతుందని తెలియజేశారు. అన్యమత ఉద్యోగుల అంశంలో కఠినంగా వ్యవహరిస్తామని, అన్యమత ఉద్యోగుల ఇంక్రీమెంట్లలో కొంతమందికి కోత జరుగుతుందని అన్నారు. కొంతమంది అన్యమత ఉద్యోగులు విఆర్ఎస్ తీసుకునేందుకు ముందుకు వచ్చారని టిటిడి ఈఓ శ్యామలరావు పేర్కొన్నారు.