* ప్రతి శుక్రవారం కుంకుమార్చన... నాల్గవ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం
యాదగిరిగుట్ట,జూలై 22 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );: ప్రసిద్ధ పుణ్యక్షేత్ర పట్టణమైన యాదగిరిగుట్టలో లోటస్ టెంపుల్ గా పేరుగాంచిన శ్రీ మణి ద్వీపేశ్వరీ విశ్వ జననీ పరాశక్తి పీఠం ఆలయంలో శ్రావణమాసం సందర్భంగా ఉచిత సామూహిక కుంకుమార్చనలు, సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహిస్తున్నట్లు పీఠం నిర్వాహకులు తెలిపారు. ఈ మాసంలో ప్రతి శుక్రవారం సామూహిక కుంకుమార్చన, అదే విధంగా నాల్గవ శుక్రవారం రోజున సామూహిక వరలక్ష్మీ వ్రతం నిర్వహించనున్నారు. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటలకు కుంకుమార్చన, అలాగే నాలుగవ శుక్రవారం రోజున ఉదయం 11 గంటలకు సామూహిక వరలక్ష్మీ వ్రతం నిర్వహించనున్నారు. ఈ వ్రతాల్లో పాల్గొనదలచిన భక్తులు తమ వెంట అవసరమైన ప్లేట్, కలశం చెంబు ,పూలు ,పండ్లు, తమలపాకులు తెచ్చుకోవాలని కోరారు. ఈ ఆలయంలో నిత్యోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు .భక్తులు కోరిన కోరికలు నెరవేరిచే అమ్మదయ అపారంగా ఉందని సందర్శకులు తెలుపుతున్నారు. ఈ అవకాశాన్ని భక్తులంతా వినియోగించుకోవాలని అమ్మవారి కృపకు పాత్రులై ధన ధాన్యములు, సౌభాగ్యం పొంది సుఖశాంతులతో వర్ధిల్లాలని ,తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మ కృపకు పాత్రులు కావాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు