సినిమా పూర్తయిన తర్వాత కూడా నిధి ఒక్కసారి కూడా విరామం తీసుకోకుండా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటోందని

 


తెలుగు ప్రేక్షకులకు 'సవ్యసాచి' సినిమా ద్వారా పరిచయమైంది ముద్దుగుమ్మ " నిధి అగర్వాల్ ". అఖిల్‌తో చేసిన 'మిస్టర్ మజ్ను' హిట్ ఇవ్వకపోయినా.. రామ్ పోతినేనితో చేసిన 'ఇస్మార్ట్ శంకర్' మూవీ బ్లాక్‌బస్టర్ కొట్టింది. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకున్న నిధికి తమిళ సినిమాల్లో కూడా మంచి క్రేజ్ ఉంది. చివరిగా 2022 లో సినిమాల్లో కనిపించిన ఈ భామ.. మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్‌ 'హరిహర వీరమల్లు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా సినిమాకు తొలుత క్రిష్ జగర్లమూడి దర్శకత్వం వహించగా.. పలు అనివార్య కారణాల వల్ల ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. అనంతరం జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలు స్వీకరించారు. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం జూలై 24న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.
కాగా సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయిన తరుణంలో ప్రమోషన్ లో స్పీడ్ పెంచారు. లేటెస్ట్ గా గ్రాండ్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఇందులో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ నిధి అగర్వాల్ ని పొగడ్తలతో ముంచెత్తారు. దీంతో ఈ వ్యవహారం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. నిధిని చూస్తే సిగ్గేసింది.. పవన్ మాట్లాడుతూ.. నిధి అగర్వాల్‌పై ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించారు. సినిమా పూర్తయిన తర్వాత కూడా నిధి ఒక్కసారి కూడా విరామం తీసుకోకుండా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటోందని అన్నారు. వరుస ఇంటర్వ్యూలు చేస్తూ, సినిమాను తన భుజాలపై మోస్తోందని చెప్పుకొచ్చారు. ఇది నిజంగా అభినందించదగిన విషయం అని.. ఒకానొక సందర్భంలో తనని చూస్తే బాధగా అనిపించిందని తెలిపారు. కెరీర్ కూడా పట్టించుకోకుండా ప్రమోషన్స్ కోసం సమయం ఇవ్వడం చూస్తే సిగ్గేసిందని వ్యాఖ్యానించారు.


మరోవైపు ఇది కేవలం మా నిర్మాత ఏఎం రత్నం కోసం పెట్టిన మీటింగ్ అని అన్నారు. ఒకప్పుడు చాలా మంది నిర్మాతలు, హీరోలు ఆయన చుట్టూ తిరిగేవారు. కానీ ఇప్పుడు ఆయన తలుచుకుంటే కన్నీళ్లు వస్తున్నాయి. ఆయన బాధను చూసి ఈ సినిమా చేసానంటూ తెలిపారు. అలానే తనను ఇతర హీరోలతో పోల్చితే అంత పెద్ద బిజినెస్ ఉండకపోవచ్చని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఎందుకంటే తన దృష్టి ప్రజల పట్ల, సమాజం పట్ల ఎక్కువగా ఉంటుందని వెల్లడించారు. చిరంజీవి కుమారుడు అయినా, తమ్ముడు అయినా.. టాలెంట్ లేకపోతే నిలబడలేరన్నారు.
ఇక రీసెంట్ గానే వీరమల్లు ప్రమోషన్స్ లో భాగంగా నిధి.. ఒక్కరోజులో ఏకంగా 15కి పైగా మీడియా ఇంటర్వ్యూలు ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చింది. ఒక్కో ఇంటర్వ్యూ సగటున 30 నిమిషాల పాటు జరగగా.. సుమారు ఎనిమిది గంటలపాటు కూర్చుని వారితో మాట్లాడింది.