శ్రీ‌శైలం మ‌ల్ల‌న్న ఆల‌యానికి 27రోజుల్లో రూ.4.17కోట్ల ఆదాయం..!

శ్రీ‌శైలం జూలై 24 (ఆయుధం న్యూస్); : భ్ర‌మ‌రాంబ స‌మేత మ‌ల్లికార్జున స్వామివారి హుండీల‌ను దేవ‌స్థానం అధికారుల‌ను గురువారం లెక్కించారు. ఈ సంద‌ర్భంగా రూ.4.17 కోట్ల ఆదాయం న‌గ‌దు రూపేణ ఆదాయం స‌మ‌కూరింద‌ని ఈవో శ్రీ‌నివాస‌రావు తెలిపారు. ఈ ఆదాయం గ‌త 27 రోజుల్లో భ‌క్తులు (జూన్ 27 నుంచి జులై 23 వరకు) స‌మ‌ర్పించిన హుండీల ద్వారా రూ.4,17,61,215 ఆదాయం వ‌చ్చింద‌ని పేర్కొన్నారు. అలాగే, 225 గ్రాముల 600 మిల్లీగ్రాముల బంగారు, 11 కిలోల‌కుపైగా వెండిని భ‌క్తులు కానుక‌ల రూపంలో సమ‌ర్పించార‌న్నారు.