24 న శ్రీ మాందేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన

యాదగిరిగుట్ట  జూలై 23 (ఆయుధం న్యూ స్);: జీవుడు ముఖ్యంగా మానవుడు తన దైనందిన జీవితంలో చేసే కర్మ ఫలాలను బట్టి శ్రీ శనీశ్వరుడు అనుగ్రహిస్తాడు...పుణ్యాలు చేస్తూ.. సేవమార్గంలో పయనిస్తూ ..దానాలు చేస్తూ.. సత్యమార్గంలో అహింసాయుతంగా ముందుకు సాగిపోయే వారికి ఆ శనీశ్వరుడు అనుగ్రహిస్తాడని ...సకల శుభాలు కలిగిస్తాడని అంటారు. అందుకే శనీశ్వరుని పూజలు చేయడం చూస్తున్నాము. ఆ శని దేవుని కుమారుడైన శ్రీ మాందేశ్వర  స్వామి ని పూజిస్తే సకల దోషాలు పోతాయని, కోరిన కోర్కెలు నెరవేరుతాయని, జీవితం సకల సౌభాగ్యాలతో తులతూగుతుందని పెద్దలు చెబుతున్నారు. పుణ్యక్షేత్ర పట్టణమైన యాదగిరిగుట్టకు అతి సమీపంలో, మల్లాపురం మార్గంలో, సైదాపురం గ్రామ పరిధిలోని శ్రీ బోదా నందగిరి స్వామి ఆశ్రమం ఒక గొప్ప ఆధ్యాత్మిక సేవా కేంద్రంగా రూపు దాల్చింది. ఒకవైపు గో సేవ.. మరోవైపు వృద్ధాశ్రమం.. అలాగే శ్రీశ్రీ శ్రీ కాలభైరవ శక్తి పీఠం ఆలయం ఇందులోనే ఉన్నాయి. తాజాగా శనీశ్వరుని కుమారుడైన శ్రీ మాందేశ్వర స్వామి విగ్రహ స్థాపనకు ఆశ్రమ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ బోధానందగిరి స్వామి ఈ బృహత్తర కార్యక్రమానికి ఉపక్రమించారు. గత శుక్రవారం శ్రీ మందేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపనకు భూమి పూజ నిర్వహించారు . ఈనెల 24వ తేదీ గురువారం అమావాస్య రోజున ఉదయం 9 గంటలనుంచి 9.40 గంటల మధ్య శ్రీ మాందేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన గుళిక కాలంలో జరుపుతున్నారు. సాంప్రదాయబద్ధంగా.. శాస్త్రోక్తంగా ...మంగళ వాయిద్యాలు మ్రోగుతుండగా...సంబంధిత మంత్రాలాపన మధ్య జరిగే అత్యంత శుభదాయకమైన ఈ లింగరూప విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ఆశ్రమ అభిమానులు ,భక్తులు హాజరుకావాలని ఆశ్రమ నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.