ఉప్పొంగిన అభిమానం ఘనంగా స్వాగతం పలికిన ఆత్మకూర్ కాంగ్రెస్ పార్టీ

 ఉప్పొంగిన అభిమానం 


 జన సంద్రోహంగా మారిన ఆత్మకూరు పట్టణం 


 ఘనంగా స్వాగతం పలికిన ఆత్మకూర్ కాంగ్రెస్ పార్టీ 


 మా పార్టీ నాయకులు కార్యకర్తలు బ్రోకర్లు కాదు లీడర్లు మంత్రి వాకిటి 


 ఆత్మకూరు జూన్ 20   (ఆయుధం  ప్రతినిధి );   మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం పూర్తి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా మొత్తం నియోజకవర్గంలోని ఆత్మకూరు మండల కేంద్రానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధి మత్స్య క్రీడలు మరియు యువజనుల శాఖ మంత్రివర్యులు డా” వాకిటి శ్రీహరి కి ఘనంగా స్వాగతం పలికిన ఆత్మకూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు 


 తమ అభిమాన నాయకుడు మండల కేంద్రానికి మంత్రి హోదాలో మొదటిసారిగా విచ్చేస్తున్న సందర్భంగా మొదటగా చెర్ల పరమేశ్వరునికి పూజలు నిర్వహించిన అనంతరం చౌరస్తాలోని గాంధీజీ, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసిన గౌరవ మంత్రివర్యులు 

 అనంతరం మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ర్యాలీగా చౌరస్తా నుండి బయలుదేరి పట్టణంలోని సాయి తిరుమల ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు ప్రోసిడింగ్లను అందజేసిన గౌరవ మంత్రివర్యులు* 


 అనంతరం గౌరవ మంత్రివర్యులు మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లను అందజేస్తామని అందులో భాగంగా మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ లబ్ధిదారులతో సింగల్ రూపాయి కూడా తీసుకోకుండా ఇందిరమ్మ ఇండ్లను పేదోళ్లకు అందేలా చేస్తున్నారని,మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు బ్రోకర్లు గా కాకుండా లీడర్లుగా నిత్యం ప్రజలకోసం పని చేస్తున్నారాని అన్నారు... 


 ఇట్టి కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు,అభిమానులు, తదితరులు పాల్గోన్నారు