మిగతా పనులు మీరు చేసుకొండని వారికి అప్పగించడం ఎంతవరకు సమంజసం?
అలా అప్పగించినప్పుడు హోసింగ్ అధికారులు గాని రెవెన్యూ అధికారులు ఎలా సమ్మతించారు ?
ఈ విషయం కలెక్టర్ ఎలా ఒప్పుకొంది?
కాంట్రాక్టర్ పూర్తిచేయాల్సిన పనులు పూర్తిచేయకుండా వెళితే అసంపూర్తిగా ఉన్న వాటి పరిస్థితి ఏమిటి?
ఇలా ఎక్కడైనా జరిగిందా?
మహబూబ్ నగర్ జూన్ 21 (ఆయుధం బ్యూరో ); జిల్లాలోని జర్నలిస్ట్ లకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హయాంలో కొందరికి
బి పి ఎల్ కింద ఇంటి స్థలాలను ఏనుగొండ శివారులోని సర్వే నెంబర్ 25 లో అప్పటి కాంగ్రెస్ 2009 -2013 ప్రభుత్వం స్థలాలను మంజూరు చేసి ఇంటి స్థలాల పట్టాలు ఇచ్చారు. అనంతరం జరిగిన వివిధ పరిణామాలతో రెవెన్యూ శాఖ అధికారులు ఇంటి స్థలాల పట్టాలు తీసుకొని వాటి స్థానంలో ఇండ్లు పూర్తయినట్లు ఇంటి నంబర్ వేసి ఇక మీరు గృహప్రవేశం చేసుకొండన్నట్లుగా ఇంటి నెంబర్ తో సర్టిఫికేట్లు జారీ చేశారు. తీరా అక్కడికి వెళ్లి చూస్తే ఇండ్లుమాత్రం లేవు. ఇదిలా వుండగా బి ఆర్ ఎస్ ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రిగా ఉన్న శ్రీనివాసగౌడ్ ఆధ్వర్యంలో దాదాపు 85 నుంచి 90 ఇండన్లు నిర్మించడానికి ఒక కాంట్రాక్టర్ కు డబుల్ బెడ్ ఇండ్ల నిర్మాణ పనులు అప్పగించారు.
ఆ కాంట్రాక్టర్ 85 నుంచి 90 ఇండ్ల వరకు పూర్తి చేయాల్సింది పోయి కొన్ని ఇండ్లు పూర్తిచేసి, మరి కొన్ని ఇండ్లకు పూర్తిగా పిల్లర్లు లేపి మరి కొన్ని ఇండ్లకు బేస్మెంట్ లెవల్ వరకు పిల్లర్లు వేశారు. ఇంకా కొన్ని ఇండ్లకు కేవలం పుటింగ్ వరకు చేసి తనకు ప్రభుత్వం నుంచి రావలసిన బిల్లులు రాలేదని ఆర్దాంతరంగా పనులు వదలి వెళ్ళిపోయాడు. కాగా పిల్లర్లు పూర్తయి, చెత్తువేసిన వాటిని జిల్లా హోసింగ్ అధికారులు, రెవెన్యూ అధికారులు లబ్ధిదారులకు అప్పగించి, మిగతా పనులు మీరు చేసుకొండని వారికి అప్పగించడం ఎంతవరకు సమంజసం. ఒక కాంట్రాక్టర్ ఒక పనిని తీసుకున్నాక ఆ పని పూర్టెయ్యేదాకా లబ్దిదారులకు అప్పగించవచ్చా? అలా అప్ప గించినప్పుడు హోసింగ్ అధికారులు గాని రెవిన్యూ అధికారులు ఎలా సమ్మతించారు ? ఈ విషయం కలెక్టర్ ఎలా ఒప్పుకొంది? కనీస అవగాహన లేకుండా కాంట్రాక్టర్ పూర్తిచేయాల్సిన పనులు పూర్తిచేయకుండా వెళితే అసంపూర్తిగా ఉన్న వాటి పరిస్థితి ఏమిటి. ఇలా ఎక్కడైనా జరిగిందా? అదేవిధంగా ఇదే జిల్లాలోని మౌలాలి గుట్టలో పూర్తయిన ఇండ్లను ఇదే అధికారులు లబ్దిదారులకు ఎందుకు అప్పగించలేక పోతున్నారు? ఇక్కడొక న్యాయం మరోచోట మరో న్యాయమా.? ఇదిలా ఉండగా రెవెన్యూ శాఖ అధికారులకు బి పి ఎల్ అంటే అర్థం తెలుసా? ప్రభుత్వం ఎలాంటి ఆస్తులు, ప్రభుత్వ ఉద్యోగాలు లేని వారికి కేటాయించాలీ. కానీ నిరుపేద జర్నలిస్ట్ లకు నివాసం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ లు నిర్మించి ఇవ్వడానికి నిర్ణయిస్తే మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో మాత్రం బహుళ అంతస్థుల భవనాలు, ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారిని బి పి ఎల్ క్రింద పరిగణించారు. అదేవిధంగా కాంట్రాక్టర్ పూర్తి చేసిన ఇండ్లను వాస్తవంగా ఇండ్లు ఉన్నవారికి కేటాయినుంచి ఇండ్లు లేనివారు అద్దె ఇండ్లలో జీవనం సాగిస్తున్నవారికి ఖళీ స్థలం ఇవ్వడం ఎంతవరకు సమంజసం.
బి పి ఎల్ కింద ఇచ్చిన స్థల విస్తీరణమును మించి గుట్టను సైతం త్రవ్వి బహుళ అంతస్థుల భవనాలు నిర్మించుకొంటే రెవెన్యూ అధికారులుగాని, పురపాలక శాఖ అధికారులు గానీ చివరకు స్థానిక శాసన సభ్యులు, జిల్లా కలెక్టర్ సైతం పట్టించుకోరా? ఇదెక్కడి న్యాయం. అందరికీ న్యాయం చేయాల్సిన ప్రజా ప్రతినిధి మరియు జిల్లా కలెక్టర్ కు చీమ కుట్టినట్టయినా లేదా? అదే వేరే బడుగు బలహీన వర్గాలవారు ఇలాచేస్తే ఊరుకొంటారా? మౌలాలి గుట్టలో జర్నలిస్ట్ లకు కట్టిన ఇండ్లు కనీసం ఆయా జర్నలిస్టులు చనిపోయిన తర్వాత కూడా ఇవ్వరా? ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు మానవతా దృష్టితో ఆలోచించి పూర్తి అయిన ఇండ్లను ఆయా లబ్దిదారులకు అప్పగించి, అదేవిధంగా సర్వేనెంబర్ 25లో ని అక్రమాలపై విచారణ జరిపించడం తోబాటు అసంపూర్తి ఇండ్లను కనీసం ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో చేర్చి పూర్తి చేయించాల్సిన గురుతర భాద్యత జిల్లా కలెక్టర్, శాసన సభ్యులపై ఉంది.
(మాదిరాజు పద్మనాభ రావు )