మహబూబ్ నగర్ (ఆయుధం న్యూస్): నియోజకవర్గం లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఇండ్లు కూలిపోయి నిరాశ్రయులుగా మారిన 68 కుటుంబాలకు మహబూబ్ నగర్ లోని జడ్పీ హాల్ లో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వంటసామాగ్రి, దుప్పట్లు, నిత్యావసర వస్తువులను మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ గారి చేతులమీదుగా పంపిణీ చేయడం జరిగింది.*
మహబూబ్ నగర్ పట్టణంలోని సుశ్రుత పీపుల్స్ ఆస్పత్రిలో కరోనా ప్రత్యేక వైద్యశాలను మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ గారు ప్రారంభించడం జరిగింది.
మహబూబ్ నగర్ మున్సిపాలిటీ కార్యాలయం వద్ద వినాయక చవితి పండుగను పురస్కరించుకుని మట్టి గణపతుల విగ్రహాలను మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ గారి చేతులమీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, వైస్ చైర్మన్ గణేష్, కౌన్సిలర్ రాము, రవికిషన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకట రావు గారు, అడిషనల్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, మున్సిపల్ కమిషనర్ సురేందర్ మరియు తదితరులు పాల్గొన్నారు.
మహబూబ్ నగర్ పట్టణంలో వినాయక భవన్ నిర్మాణం కొరకు మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ గారు స్థలాన్ని పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకట రావు గారు, జాయింట్ కలెక్టర్ రామారావు గారు, అడిషనల్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఆర్డీఓ శ్రీనివాస్ గారు మరియు తదితరులు పాల్గొన్నారు.






