దిల్లీ: (ఆయుధం న్యూస్) ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ వేర్వేరుగా ట్వీట్లు చేశారు. రాష్ట్రపతి కోవింద్ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ తెలుగులో ట్వీట్ చేశారు.
ప్యానల్ బోర్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగడం వల్లే ప్రమాదం చోటుచేసుకుందని తెలంగాణ విద్యుత్ శాఖ స్పష్టం చేసింది. తొమ్మిది మంది మృతిచెందినట్టు అధికారికంగా వెల్లడించింది. ఇప్పటివరకు ఎనిమిదిమృతదేహాలను సహాయక బృందాలు వెలికి తీశాయనీ.. మరొకరి కోసం గాలిస్తున్నట్టు పేర్కొంది..
