ఎంవీఎస్ డిగ్రీ కళాశాల - కాంట్రాక్టు లెక్చరర్ మృతి


మహబూబ్ నగర్ (ఆయుధం న్యూస్) : ఎంవీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కాంట్రాక్టు పద్దతి పై అధ్యాపకుడిగా పని చేస్తున్న గంధం లక్మీకాంత్ (40)  మంగళవారం తెల్లవారు జామున 4గంటల ప్రాంతంలో మృతి చెందారు. లక్ష్మీకాంత్ రాజనీతి శాస్త్రం అధ్యాపకుడిగా పని చేస్తున్నారు. 


గత కొంత కాలంగా కాలేయ సంబంధిత కేన్సర్ జబ్బుతో బాధ పడుతున్నాడు. హైదరాబాదులోని సన్‌షైన్, బసవతారకం కేన్సర్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్న ఫలితం లేకపోయింది. వారం క్రితం ఉస్మానియా ఆస్పత్రిలో చేర్చారు.
అక్కడ చికిత్స పొందుతూ చనిపోయారు.  ఆయనకు భార్య వేణి, కుమారుడు గౌరీనందన్(9), ఆర్యన్ (6) ఉన్నారు.  లక్ష్మీ కాంత్ స్వగ్రామం జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం ప్రాగటూరు.   2007లో కాంట్రాక్టు పద్ధతి పై మొదట గద్వాల, తర్వాత ఆత్మకూరు, మహబూబ్ నగర్ లో డిగ్రీ లెక్చరర్‌గా విధులు నిర్వహించారు. 

డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ విజయకుమార్ లక్ష్మీకాంత్ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు.

మంత్రి శ్రీనివాస్ గౌడ్ హామీ
లక్ష్మీ కాంత్ అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరామర్శించారు. వ్యాధి నయం కోసం రూ. 8లక్షలు ఖర్చయ్యాయని ఆ మొత్తం సీఎం ఆర్ఎఫ్ నిధుల నుంచి ఆర్థిక సాయం చేయిస్తానని హామీ ఇచ్చారు. సాయం అందలేదని మంత్రి స్పందించి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని మృతుని భార్య వేణి కన్నీరు మున్నీరుగా విలపించారు. తమది నిరుపేద కుటుంబం అని తెలిపారు.