నస్రుల్లాబాద్ గ్రామంలో నేడు అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ 129వ జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. MLA లక్ష్మారెడ్డి పిలుపు తో అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని నేడు అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు సర్పంచ్ పులదండలు వేసి గ్రామంలో 100 మొక్కలు నాటడం జరిగింది, యువకులు గ్రామానికి ఉపయోగపడే విధంగా చెట్లు నాటడం అనేది అంబేద్కర్ గారికి నిజమైన నివాళి అని గ్రామ సర్పంచ్ ప్రణీల్ చందర్ అన్నారు. మహనీయుల జయంతి నాడు సమాజ హితం కోరే కార్యక్రమాలు చేయడం హర్షించదగ్గ విషయం, గ్రామంలో వంద మొక్కలు నాటిన అంబేద్కర్ యువజన సంఘం సభ్యులకు గ్రామ పంచాయతీ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు సర్పంచ్ గారు తెలియచేసారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ స్వాతి నరేందర్, వార్డ్ సభ్యులు సత్యం,రామాంజనేయులు, వెంకటేష్,అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు శ్రీనివాస్,నాగేష్,ఆంజనేయులు, శివ, శంకర్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు
