ఇతర ప్రాంతాల వలస కార్మికులకు అండగా


మక్తల్  (ఆయుధం న్యూస్) :  వలస కార్మికులకు అండగా ఉంటాం. భాజపా అభియాన్ చైర్మన్ కొండయ్య ఇతర ప్రాంతాల వలస కార్మికులకు భారతీయ జనతా పార్టీ అండగా ఉండి  ఆదుకుంటామని కొండయ్య అన్నారు. బిజెపి అర్బన్ అధ్యక్షుడు బాయ్ కాడి రాజశేఖర్ రెడ్డి అధ్యక్షతన మున్సిపల్ కార్యాలయం ఆవరణలో వలస కార్మికులకు నిత్యావసర సరుకులు అందజేత కార్యక్రమానికి హాజరై వారు మాట్లాడుతూ ఏ ప్రాంతానికి చెందిన వారైనా  కష్టకాలంలో మక్తల్ లో ఉంటూ పనులు లేక  పస్తులుంటున్నఅరవై  కుటుంబీకులకు నిత్యావసర సరుకులను అందించేందుకు నిర్ణయించుకొని పంపిణీ చేస్తున్నామని వారు అన్నారు.  మక్తల్ పట్టణంలో గత కొన్ని సంవత్సరాలుగా   శ్రీకాకుళం విజయనగరం గుంటూరు కృష్ణ గోదావరి రాజస్థాన్ హర్యానా ప్రాంతాలకు చెందిన వలస కార్మికులు గా జీవనం కొనసాగిస్తున్నారు కరోనా లాక్ డౌన్ కారణంగా చేయడానికి పనిలేక, సరుకులు కొనడానికి నగదు లేక ఒక పూట తింటూ జీవనం సాగిస్తున్న  విషయం తెలుసుకొని చలించిపోయాను.  ఇలాంటి వారికి బిజెపి అండగా ఉంటుందని బి.కొండయ్య అన్నారు. కరోనా బాధిత  కుటుంబాలకు చెందిన  కార్మికులకు  ఒకొక్కరికి 12 కిలోల చొప్పునబియ్యం  ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశాలు ఉన్నా స్థానిక తహసీల్దార్ నేటికి జాబితా తయారు చేయకపోవడం, అందుకు అధికారపార్టీ చొరవ చూపకపోవడం విడ్డూరంగా ఉందని కొండయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కర్నూలు స్వామి కల్లూరి నాగప్ప మల్లికార్జున్ బలరాం రెడ్డి చీరాల సత్యనారాయణ పాల్గొన్నారు. అంతకుముందు మక్తల్ మెడికల్ అసోసియేషన్ కొండా విజయ్ కుమార్ వ్యాపారస్తుల చొరవతో సంగంబండ నిర్వాసిత ప్రాంతమైన కొత్త కొత్త గార్ల పల్లి బుడగ జంగాలకుకరోనా నుంచి రక్షణ పొందేందుకు శానితాయిజర్ ను ఏబీవీపీ నాయకుడు మంజునాథ్ పంచిపెట్టారు