-200 వందల మంది పాత్రికేయులకు నిత్యావసర సరుకుల కిట్లు అందజేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్....
-హర్షం వ్యక్తం చేసిన జర్నలిస్టులు..
కరోనా వైరస్ నేపథ్యంలో వాటి నియంత్రణలో భాగంగా పోలీస్ వైద్య పారిశుద్ధ్య కార్మికుల తో పాటు జర్నలిస్టుల పాత్ర కీలకం అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ,కలెక్టర్ వెంకట్రావు ఎస్పీ రేమ రాజేశ్వరి తో కలిసి జర్నలిస్టులకు నిత్యావసర సరుకుల కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ పాత్రికేయులు వ్యక్తిగత శుభ్రత తో పాటు మాస్కులు ధరించి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. జర్నలిస్టులు ఇంటి నుంచి బయటికి వెళ్లే ముందు తమ కుటుంబ సభ్యులను గుర్తు చేసుకోవాలని తద్వారా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. జర్నలిస్టులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎవరు అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు. త్వరలో పాత్రికేయులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అందజేస్తామని తెలిపారు. జర్నలిస్టులు మంత్రీ శ్రీనివాస్ గౌడ్ గారికి ధన్యవాదాలు తెలియజేశారు